‘ఫస్ట్ రౌండ్ లోనే మ్యాటర్ అర్థమైపోయింది. అందుకే..’

RK ROJA: ఒకప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సినీ తార ఆర్కే రోజా. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తన కృషి పట్టుదలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కేవలం సినిమాలోనే కాకుండా రాజకీయాలలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ.. ఫైర్ బ్రాండ్ గా నిలిచారు రోజా. తాజాగా ఏపీ శాసనసభ ఎన్నికల ఓటమిపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

నటి ఆర్కే రోజా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరో రాజేంద్రప్రసాద్ సరసన 'ప్రేమ తపస్సు' అనే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టారు రోజా. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి తదితర స్టార్ హీరోల సరసన నటించిన మెప్పించారు. తన ఖాతాలో ఎన్నో విజయాలను నమోదు చేసుకున్నారు. తన కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే.. తమిళ దర్శకుడు ఆర్కే సేల్వమనీ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత వారిద్దరు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.

Actress RK Roja made shocking comments about the 2024 election results

ఆ తర్వాత రాజకీయాలపై ఇంట్రెస్ట్ తో టిడిపిలో చేరారు నటి రోజా. నారా చంద్రబాబు నాయుడు, టిడిపి పెద్దల ప్రోత్సాహంతో ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా పనిచేసే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా 1999 నుండి 2009 వరకు తెలుగుదేశం మహిళ అధ్యక్షురాలుగా వ్యవహరించారు. కానీ, 2004, 2009 శాసనసభ ఎన్నికలలో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుండి పోటీ చేసినా రోజా ఓటమిపాలయ్యారు. దీంతో టీడీపీకి రాజీనామా చేసి.. వైసీపీలో అడుగుపెట్టారు. జగన్ ప్రోత్సాహంతో ప్రత్యర్థులపై వాడి వేడి విమర్శలు చేస్తూ, ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఫైర్ బ్రాండ్ గా పేరు పొందారు.

ఆ తర్వాత నగరి నుండి పోటీ చేసి గెలుపొందారు. అలా 2014లో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు రోజా. కానీ ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉండటంతో జగన్ ఆదేశాల మేరకు నడుచుకున్నారు. 2019 ఎన్నికలలో మరోసారి నగరి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఈసారి వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమెను ఏపీఐఐసి చైర్పర్సన్ గా నియమించారు జగన్. ఆ తర్వాత యువజన పర్యాటక శాఖల మంత్రిగా నియమించారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

కానీ, 2024 ఎన్నికల్లో రోజా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోలేకపోయారు. దీంతో కాస్త రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇంటికి పరిమితమయ్యారు. తాజాగా నటి, మాజీ మంత్రి రోజా ఓ ఇంటర్వ్యూలో2024 ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. ఫస్ట్ రౌండ్ లోనే తనకు మ్యాటర్ ఏంటో అర్థం అయిపోయిందని, ఊహించని విధంగా కూటమికి ఓటు రావడంతో తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. ఎన్నికల ముందు ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయని, ఎస్పీలు కలెక్టర్లు మారిపోయారని, కూటమికి అధికారులు కూడా సపోర్టుగా నిలిచారని, ఆరోపించారు. ఎన్నికలను గందరగోళ పరిస్థితులలో నిర్వహించారని, తన జీవితంలో ఇలాంటి ఎన్నికలను తాను ఎప్పుడూ చూడలేదని రోజా పేర్కొన్నారు.

Actress RK Roja made shocking comments about the 2024 election results

ఎన్నికల కౌంటింగ్ సమయంలో సరైన భద్రత ఏర్పాట్లు చేయలేదంటూ రోజా ఆరోపించారు. తన నియోజకవర్గంలోని వడమాల అనే మండలంలో తనకు ఊహించని ఎదురు దెబ్బ తగిలిందని, కానీ అది వైసీపీకి కంచుకోట లాంటి మండలము అని అలాంటి ప్రాంతంలో కూటమికి మూడు వేల ఓట్ల మెజార్టీ ఎలా వచ్చిందో తనకు అర్థం కాలేదన్నారు. గతంలో తన మెజార్టీకి గెలుపుకు కారణం అన్నారు. అలాంటి మండలంలో తొలి రౌండ్ లోనే కూటమికి మూడు వేల ఓట్లు, ఆ తర్వాత రెండో రౌండ్లో కూడా 3000 ఓట్లు మెజార్టీ రావడంతో తనకు పరిస్థితి అర్థం అయిందని ఆరోపించారు. కానీ ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదంటూ.. అక్కడినుండి తాను వెళ్లిపోయానని పేర్కొన్నారు నటి రోజా.

ఆ పరిణామం తర్వాత తాను తన నియోజకవర్గానికి వెళ్లిపోయారని, అక్కడ తనకంటే కార్యకర్తలే ఎక్కువగా బాధపడ్డారని వారికి ధైర్యం చెప్పి. ఓదార్చానని మాజీ రోజా తెలిపారు. వారం రోజుల తర్వాత తాను చెన్నైకి వెళ్తే.. రోజా తట్టబుట్ట అన్ని సదురుకొని చెన్నైకి మక్కా మార్చింది అంటూ తనపై పుకార్లు పుట్టించారని, తనపై అబద్ధపు ప్రచారం చేశారని తెలిపారు. తాను ఇంకా నగరిలోనే ఉన్నానని తన ప్రజల మధ్యనే ఉన్నానని పేర్కొన్నారు. కానీ, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తనపై అబద్ధపు ప్రచారం ట్రోల్స్ చేస్తున్నారని బాధపడ్డారు. తాను రాష్ గా మాట్లాడితేనే.. మీడియాలో చూపిస్తున్నారని, అలా మాట్లాడితేనే చూపిస్తారంటే రోజు ఒకరిని టార్గెట్ చేస్తానంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. కానీ ప్రజల సమస్యపై ప్రతినిత్యం స్పందిస్తానని నటి,మాజీ మంత్రి రోజా తెలిపారు.

More from Filmibeat

Read more about: rk roja pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X