Roja: కూతురు పెళ్లిపై నటి రోజా క్లారిటీ.. స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందా?

మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఫైర్‌బ్రాండ్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న రోజా, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రోజా అత్యంత యాక్టివ్‌గా వ్యవహరించారు. ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు, టీవీ డిబేట్స్, సభల ద్వారా రోజా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచారు. అయితే 2024 ఎన్నికల్లో ఎదురైన పరాజయం ఆమెకు ఒకింత షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత రాజకీయ వివాదాలపై రోజా అరుదుగా మాత్రమే స్పందిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. రోజా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఆమె కూతురు అన్షు మాలిక (Anshu Malika) గురించి వరుసగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అన్షు మాలిక సినీ ఎంట్రీ ఇవ్వబోతుందంటూ, అంతేకాదు ఓ స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ రూమర్స్ అభిమానుల్లోనూ, నెటిజన్లలోనూ ఆసక్తిని రేపాయి. ఈ విషయంపై నటి రోజా క్లారిటీ ఇచ్చారు.

Actress Roja Clarifies Rumours About Daughter Anshumalika Selvamani s Marriage and Film Entry

నటి రోజా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ రూమార్స్ పై క్లారిటీ ఇచ్చారు. "నా కూతురు పెళ్లి ప్రపోజల్స్ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు" అని రోజా స్పష్టంగా చెప్పారు. స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందన్న ప్రశ్న అడిగిన వెంటనే రోజా షాక్ అయినట్లు తెలిపారు. 'ఇప్పటివరకు అలాంటి వార్తలు అయితే నేను వినలేదు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో చెప్పండి' అంటూ ఆమె నవ్వుతూ స్పందించారు.

అన్షు మాలిక గురించి ఇప్పటివరకు ఎన్నో రూమర్స్ వచ్చాయని రోజా తెలిపారు. ఆమె యాక్టింగ్ కోసం, డ్యాన్స్ కోసం విదేశాలకు వెళ్లిందని, హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం జరిగిందన్నారు. కానీ వాస్తవానికి తన కూతురు చదువుకోడానికి అమెరికాకు వెళ్లిందని రోజా స్పష్టం చేశారు. అన్షు లక్ష్యం సైంటిస్ట్ కావడమేనని, చదువులపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందని వెల్లడించారు. ఇటీవల ఆమె ఇటాలియన్ భాషను కూడా నేర్చుకుందని తెలిపారు.

తన కూతురు యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వస్తే తనకు ఎంతో సంతోషమేనని రోజా అన్నారు. 'యాక్టింగ్ అనేది ఒక వరం. అది అందరికీ దొరకదు. తనకు నిజంగా ఆ ఫీల్డ్ మీద ఆసక్తి ఉంటే నేను కచ్చితంగా ఎంకరేజ్ చేస్తా' అని చెప్పారు. అయితే ప్రస్తుతం అన్షు చదువులకే ప్రాధాన్యం ఇస్తోందని, కెరీర్ విషయంలో పూర్తిగా ఆమె ఇష్టానికే వదిలేశామని అన్నారు.

తన పిల్లలను ఎప్పుడూ వాళ్ల ఇష్టానుసారంగానే పెంచానని రోజా భావోద్వేగంగా చెప్పారు. 'నా కోరికలను వాళ్లపై ఎప్పుడూ రుద్దలేదు. వాళ్లకు ఏం నచ్చుతుందో అది వాళ్లే నిర్ణయించుకుంటారు. మనం గైడెన్స్‌గా ఉంటే చాలు' అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అన్షు తనకంటే చాలా మెచ్యూర్డ్ అని, హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. చదువుతో పాటు సోషల్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటూ, పేద పిల్లల చదువులకు సహాయం చేస్తోందని చెప్పారు.

చదువుల్లో అన్షు ఎన్నో మెడల్స్ సాధించిందని, అకాడమిక్స్‌లో ముందుండటమే కాకుండా సోషల్ సర్వీస్‌లోనూ ఆసక్తి చూపుతోందని రోజా గర్వంగా వెల్లడించారు. మొత్తంగా చూస్తే, అన్షు మాలికపై వస్తున్న సినీ ఎంట్రీ, పెళ్లి రూమర్స్ అన్నీ కేవలం ఊహాగానాలేనని, వాస్తవానికి ఆమె లక్ష్యం సైన్స్ రంగంలోనే ముందుకు వెళ్లడమని రోజా స్పష్టంగా చెప్పినట్లైంది. ఇలా అన్షు మాలికపై నెలకొన్న గాసిప్స్‌కు రోజా ఫుల్ స్టాప్ పెట్టినట్టయ్యింది.

More from Filmibeat

Read more about: rk roja anshu malika tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X