సినిమా చూస్తూ ఏడ్చేసిన సదా.. ఆ విషయాలన్నీ గుర్తు వచ్చాయంటూ ఎమోషనల్!
హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అనేక సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె ప్రస్తుతం సినిమాల్లో నటించకుండా సినిమాలకు దూరమైంది. ఇక ఈ ఈ మధ్యనే బుల్లితెర ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతానికి కొన్ని సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒక సినిమా చూస్తూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

సినీ పరిశ్రమకు దూరం
మహారాష్ట్రలోని రత్నగిరిలో సదా జన్మించింది. ఆమె తండ్రి ముస్లిం కాగా తల్లి మాత్రం మరాఠీ బ్రాహ్మిణ్. తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా ముంబైలో ఆమె సెటిల్ అయ్యారు. సినిమాల మీద ఆసక్తితో జయం అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె మొట్టమొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడంతో ఆమెకు వరుస సినిమా అవకాశాలు దక్కాయి. అలా తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సదా కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో అవకాశాలు తగ్గిపోవడంతో సినీ పరిశ్రమకు దూరం అయింది.

ఎమోషనల్ అయిపోయా
అయితే ఈ మధ్య కాలంలోనే బుల్లి తెరలో కొన్ని షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ కాస్త మళ్లీ లైన్ లో పడే ప్రయత్నం చేస్తోంది. అసలు విషయం ఏమిటంటే తాజాగా ఆమె మేజర్ సినిమా థియేటర్లో వీక్షించింది. ఆ సినిమా చూస్తున్న సమయంలోనే ఉద్వేగానికి లోనై ఆమె కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక దీనికి సంబంధించి సదా మాట్లాడుతూ సినిమా చూస్తూ ఉండగానే తాను ఎమోషనల్ అయిపోయానని తనకు ముంబై దాడుల సమయంలో ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో అదే ఫీలింగ్ సినిమా చూస్తున్నప్పుడు మళ్లీ కలిగిందని చెప్పుకొచ్చింది.

అద్భుతమైన సినిమా
ముంబయి ఉగ్రవాద దాడులు జరిగిన సమయంలో తాను కూడా ముంబైలోనే ఉన్నాను అని అప్పుడు టీవీ లో జరిగిన సంఘటనలన్నీ విన్నీ వణికిపోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు సినిమా చూస్తుంటే అప్పటి ఘటనలు అన్నీ తన కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపించిందని సినిమా చేసిన దర్శకుడు శశికిరణ్, హీరో అడవి శేష్, నిర్మాత మహేష్ బాబు లాంటి వారందరూ కూడా అద్భుతమైన సినిమా అందించారని ఆమె కొనియాడారు.

ఉగ్ర దాడులను ఆపేందుకు
ఇక శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అడవి శేష్, ప్రధాన పాత్రలో నటించారు. ఉగ్రదాడుల నేపథ్యంలో మరణించిన కేరళ రాష్ట్రానికి చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. సందీప్ ఉన్నికృష్ణన్ ఎలాంటి పరిస్థితులలో ఉగ్ర దాడులను ఆపేందుకు వెళ్లారు.

మంచి కలెక్షన్లు
అప్పుడు ఆయన కుటుంబం పరిస్థితి ఏంటి? వారి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఎలా జీర్ణించుకున్నారు? వంటి అనేక విషయాలను స్పృశిస్తూ సాగిన ఈ సినిమా దాదాపుగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ మనసు చలించిపోయింది కామెంట్లు చేస్తున్నారు అంటే సినిమా ఎలా ఉంది అనే విషయం అర్థం చేసుకోవచ్చు. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది.


Click it and Unblock the Notifications











