నేను చేసిన పెద్ద తప్పు అదే.. అందుకే నాకు అంతగా ఆఫర్స్ రాలేవు..

'జయం' సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె, చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించింది. 'అపరిచితుడు', 'అవునన్నా కాదన్నా', 'దొంగా దొంగది' వంటి హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. అయితే ఆ క్రేజ్ ఎక్కువకాలం కొనసాగకపోవడం, కెరీర్ ఒక్కసారిగా డౌన్ కావడం వెనుక కారణాలపై తాజాగా ఆమె ఓపెన్‌గా మాట్లాడింది. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు వరుస హిట్స్‌తో టాప్ హీరోయిన్‌గా దూసుకెళ్లిన నటి సదా... గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?

గత ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ... తాను చేసిన హిట్ సినిమాలకు తగిన గుర్తింపు దక్కలేదనే ప్రశ్న తనను కూడా వెంటాడుతూనే ఉంటుందని సదా తెలిపింది. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని, ఎంత టాలెంట్ ఉన్నా సరే సరైన సమయంలో సరైన అవకాశాలు రావడం కూడా చాలా ముఖ్యం అని ఆమె చెప్పింది. 'జయం' వంటి భారీ విజయం తర్వాత కూడా తాను ఆశించినంతగా ఆఫర్లు రాకపోవడం ఆశ్చర్యంగా అనిపించిందని వెల్లడించింది.

Actress Sada Throwback Interview Missed Chances Career Setbacks amp amp Untold Tollywood Journey

ఇందుకు పలు కారణాలు ఉన్నాయని సదా వివరించింది. ముఖ్యంగా తాను ముంబైలో ఉండటం, టాలీవుడ్‌లో గాడ్‌ఫాదర్ లేకపోవడం, ఆ సమయంలో సోషల్ మీడియా లేకపోవడం వంటి అంశాలు తన కెరీర్‌పై ప్రభావం చూపాయని చెప్పింది. ఇండస్ట్రీలో కనెక్ట్స్ చాలా ముఖ్యమని, అవి లేకపోతే అవకాశాలు మిస్సవుతాయని ఆమె అభిప్రాయపడింది. 'జయం' సినిమాను దర్శకుడు తేజ ఇచ్చిన అవకాశం తన జీవితాన్ని మార్చిందని, ఆ సినిమా తనకు ఎంత ముఖ్యమో ఇప్పుడే పూర్తిగా అర్థమవుతోందని తెలిపింది.

అయితే సినిమా ఫీల్డ్‌పై పూర్తిగా ఆధారపడటానికి అప్పట్లో తాను సిద్ధంగా లేకపోయినట్లు కూడా సదా చెప్పింది. నటన ఎంతకాలం కొనసాగుతుందో తెలియక, 'జయం' తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకుని తిరిగి ఐటీ చదువుపై దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. ఆ సమయంలో సినిమాల ప్రభావం, విజయాల స్థాయి గురించి పూర్తిగా అర్థం కాలేదని, ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఆ నిర్ణయాలు ఆశ్చర్యంగా అనిపిస్తాయని తెలిపింది.

తన కెరీర్‌లో కొన్ని అవకాశాలు మిస్ కావడం ఇప్పటికీ బాధ కలిగిస్తుందని సదా అంగీకరించింది. ముఖ్యంగా రజనీకాంత్ నటించిన 'చంద్రముఖి' సినిమాలో జ్యోతిక చేసిన పాత్ర, అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఆనంద్' సినిమాలో కమలినీ ముఖర్జీ చేసిన పాత్ర... ఈ రెండింటినీ తాను చేయలేకపోవడం పెద్ద మిస్సయిన అవకాశాలుగా భావిస్తున్నానని చెప్పింది. డేట్స్ సమస్యల కారణంగా ఆ సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు ఆలోచిస్తే ఆ నిర్ణయం తప్పు అనిపిస్తుందని తెలిపింది.

ఇక కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలో వరుస ఫ్లాప్స్ రావడం కూడా తన గ్రాఫ్ పడిపోవడానికి కారణమైందని సదా పేర్కొంది. 'నాగ', 'చుక్కల్లో చంద్రుడు', 'వీరభద్ర' వంటి సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో అవకాశాలు తగ్గాయని చెప్పింది. అయితే మధ్యలో చాలా ప్రాజెక్టులు తన వరకు వచ్చి ఆగిపోవడం కూడా తనకు అర్థంకాని విషయమని వెల్లడించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగా ఉన్న సదా... టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంది. డాన్స్ షోలకు జడ్జిగా పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ... మూడు సంవత్సరాల తర్వాత రిపిటేషన్ అనిపించి బ్రేక్ తీసుకున్నానని తెలిపింది. తిరిగి ఎప్పుడు వస్తానో ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేసింది.

Read more about: sadha tollywood chandramukhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X