దయచేసి కాపాడండి.. బోరున ఏడ్చేసిన నటి సదా
సౌత్ హీరోయిన్ సదా తాజాగా ఓ వీడియోను పంచుకుంది. బోరున ఏడుస్తూ కాపాడండి అంటూ మోర పెట్టుకుంది. కన్నీటిధార పోతుండగా తన బాధను మొత్తం చెప్పింది. అందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా అధికారిక అకౌంట్ ద్వారా పబ్లిక్, ఫాలోవర్స్ తో పంచుకుంది. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. సదా చెప్పిన మాటలు చర్చగా మారాయి. ఇంతకీ సదా ఎందుకు గుక్కపెట్టి ఏడ్చింది? ఏమని వేడుకుందనే వివరాల్లోకి వెళితే..
నటి సదా మొదటి నుంచి యానిమల్ లవర్. జంతు ప్రేమికురాలిగా చెప్పుకోవడమే కాకుండా ఆమె వాటి సంకర్షణ కోసం కొన్నాళ్లుగా పోరాడుతూ వస్తోంది. మూగజీవాల సంరక్షణ, వాటికి షెల్టర్, వైద్యం, ఆహారం వంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. తనకు వీలైనంత వరకు వన్యప్రాణాలకు అండగా నిలుస్తూ ఉంది. అయితే తాజాగా ఢిల్లీలోని NCR వీధిలో కుక్కల బెడదపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం వీధి కుక్కల బెడద, రాబిస్ కేసులను తగ్గించేందుకు కంకణం కట్టుకున్నాయి.

ప్రజల క్షేమమే ముందస్తుగా ఢిల్లీలోని కుక్కలను ప్రజా నివాసాలకు దూరంగా వదిలి పెట్టాలని సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఇందులో ఎలాంటి సంస్థలు, కార్యకర్తలు జోక్యం చేసుకోవద్దని సీరియస్ గా చెప్పింది. ఇప్పుడు ఈ విషయంపైనే సినీ తారలు స్పందిస్తున్నారు. వీధి కుక్కలను పూర్తిగా తరిమేయాలనే నిర్ణయం పట్ల ఇప్పటికే అడివి శేష్, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ స్పందించారు. నటి సదా ఏకంగా సుధీర్ఘమైన వీడియోను విడుదల చేసి బోరున విలపించింది.
సదా మాట్లాడుతూ.. ఢిల్లీలోని దాదాపు 3 లక్షల వీధి కుక్కలను తరిమేయడం బాధాకరంగా ఉంది. నాకు కన్నీళ్లు ఆగడం లేదు. రాబిస్ పేరుతో మూగజీవాలపై ప్రభుత్వాలు చేసే తీరు ఏం బాగా లేదు. వాటిని ఎలా రక్షించాలో ఏం అర్థం కావడం లేదు. జంతుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయిస్తోంది. దానిని వినియోగించి వాటిని సంరక్షించే సదుపాయాలు చేయొచ్చు. కానీ ప్రస్తుతం 3 లక్షల వీధి కుక్కలను తీసుకెళ్తున్నారు. వాటికి ఎలాంటి సదుపాయాలు చూడటం లేదు. పైగా చంపేయబోతున్నారు. దీన్ని అడ్డుకోవాలి.
ఈ సమయంలోనే జంతు ప్రేమికులు తమ వాయిస్ ను గట్టిగా వినిపించాలి. మీ ఇంట్లో పెంపుడు జంతులను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు. ప్రకృతి పరంగా వచ్చిన ఈ మూగజీవాలపైనా కూడా జాలి చూపించాలి. అప్పుడే మీరు జంతు ప్రేమికులు అని చెప్పుకోండి. ఇలాంటి సమయంలో నాకు ఎవరి దగ్గరికి వెళ్లి కలవాలి, ఎలా అడ్డుకోవాలనే విషయం తెలియడం లేదు. ఇండియాలో ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు సిగ్గుగా ఉంది.' అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ తన బాధను చెప్పుకుంటూ వచ్చింది. ఇక వీధి కుక్కలను తరలించడం విషయంలో సుప్రీం కోర్టు చాలా సీరియస్ గా ఉంది. వాటిని దత్తత తీసుకునే అవకాశం కూడా ఎవరికి ఇవ్వకపోవడం గమనార్హం. త్వరగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశాలు అందాయి.


Click it and Unblock the Notifications











