నెట్ డ్రెస్‌లో సదా నాటీ ఫోజులు.. 40 ఏళ్ల ఏజ్‌లో అందాలన్నీ కనిపించేలా!

తెలుగు సినిమా ద్వారా పరిచయమై.. దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పటికీ తనదైన అందం, అభినయంతో రాణిస్తోన్న క్యూట్ లేడీ సదా ఒకరు. 'జయం' సినిమా ప్రయాణం మొదలు పెట్టిన ఈ అమ్మడు.. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే సదా.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

ఆరంభంలోనే స్టార్‌డమ్
మొట్టమొదటిగా సదా తెలుగులోనే 'జయం' అనే సినిమా చేసింది. ఇందులో నటన పరంగా, అందం పరంగా మెప్పించిన ఈ చిన్నది మంచి గుర్తింపు అందుకుంది. అంతే.. ఇక టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను దక్కించుకుని సత్తా చాటింది. ఇలా టాలీవుడ్‌లోని స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఇలా ఎన్నో సినిమాలు చేసి సదా తెలుగులో స్టార్‌గా మారిపోయింది.

Actress Sadha Latest Gorgeous Photoshoot Goes Viral

ఆ భాషల్లో సత్తా చాటేసి
టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న తర్వాత సదా.. 'జయం' రీమేక్‌తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా సూపర్ హిట్ అయింది. అనంతరం 'మోనాలిసా' అనే చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అలాగే, 'నోవెల్' అనే మూవీతో మలయాళంలోకి అడుగు పెట్టింది. ఇలా సదా సౌత్ ఇండియా మొత్తంలో హవాను చూపించగలిగింది.

ఇప్పుడేమో అలాంటివి
ఒకప్పుడు ఏకధాటిగా సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలను అందుకోవడంలో సదా విఫలం అవుతోంది. ఈ మధ్యన 'అహింస', 'ఆదికేశవ' మూవీలు చేసింది. అదే సమయంలో ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్‌లు, షోలు చేస్తూ ఫుల్ బిజీగానే ఉంటోంది. ఈ క్రమంలోనే 'Hello World' సహా పలు వెబ్ సిరీస్‌లలోనూ నటించింది.

Actress Sadha Latest Gorgeous Photoshoot Goes Viral

బుల్లితెరపై షోల జడ్జ్‌గా
సినిమాల్లో ఆశించిన రీతిలో సందడి చేయకున్నా.. బుల్లితెరపై మాత్రం సదా ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ మధ్య 'ఢీ' షోలో మెరిసిన ఈ బ్యూటీ.. ఇటీవలే స్టార్ మాలో ప్రసారం అయిన 'బీబీ జోడీ' షోకు జడ్జ్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే అదే ఛానెల్‌లో వస్తోన్న 'నీతోనే డ్యాన్స్ సీజన్ 2' అనే షోకు కూడా న్యాయ నిర్ణేతగా చేస్తోంది.

అందులో ఫుల్ యాక్టివ్‌
దాదాపు రెండు దశాబ్దాలుగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. కొంత కాలంగా పెద్దగా ఆఫర్లను సొంతం చేసుకోలేకపోతున్నా.. హీరోయిన్ సదా మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.

Actress Sadha Latest Gorgeous Photoshoot Goes Viral

అందాల సుందరాంగి
సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో సదా పెద్దగా గ్లామర్ రోల్స్ చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం సుదీర్ఘ కాలంగా బోల్డు షో చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది. తద్వారా సెన్సేషన్‌గా మారుతోంది.

సదా ఫొటోలు వైరల్‌
సీనియర్ హీరోయిన్ సదా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ వేసుకుని కొన్ని ఫొటోలను దిగింది. దీంతో ఆమె లోపలి అందాలు కూడా ఓ రేంజ్‌లో హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా సదా తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X