40 ఏళ్ల ఏజ్‌లో అందాలతో ఫిదా చేస్తున్న సదా.. ఈ క్రేజీ పిక్స్ చూశారా?

టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది భామలు మాత్రమే తమదైన చిత్రాలతో సందడి చేస్తూ సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపించారు. తద్వారా స్టార్లుగా సత్తా చాటారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ సదా ఒకరు. 'జయం' మూవీతో దిగ్విజయంగా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ భామ.. చాలా ఏళ్ల పాటు వరుస సినిమాలతో సందడి చేసింది.

అయితే, ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ లేపుతోంది. తాజాగా సదా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఆలస్యం చేయకుండా వాటిపై మీరే లుక్కేయండి మరి!

Actress Sadha Latest Stunning Photoshoot Viral

అలా వచ్చి బిగ్ స్టార్‌గా: క్యూట్ లేడీ సదా 'జయం' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో అత్యుత్తమ నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె.. చాలా తక్కువ సమయంలోనే పాపులారిటీ సొంతం చేసుకుంది. తద్వారా ఆ తర్వాత టాలీవుడ్‌లోని స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఇలా ఎన్నో సినిమాలు చేసి తెలుగులో స్టార్‌గా ఎదిగిపోయి సత్తా చాటింది.

Actress Sadha Latest Stunning Photoshoot Viral

ఆ భాషల్లోనూ హవానే: ఆరంభంలోనే టాలీవుడ్‌లో అదిరిపోయే ఇమేజ్‌ను అందుకున్న సదా.. ఆ తర్వాత 'జయం' రీమేక్‌తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా సూపర్ హిట్ అయింది. అనంతరం 'మోనాలిసా' అనే చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అలాగే, 'నోవెల్' అనే మూవీతో మలయాళంలోకి అడుగు పెట్టింది. ఇలా సౌత్ మొత్తం హవాను చూపింది.

Actress Sadha Latest Stunning Photoshoot Viral

ఇప్పుడు మాత్రం అవే: ఈ మధ్య కాలంలో హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న సదా.. వేరే భాషల్లోనూ అవకాశాలను పెద్దగా దక్కించుకోలేదు. ఫలితంగా ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్‌లు, షోలు చేస్తూ ఫుల్ బిజీగానే ఉంటోంది. ఈ క్రమంలోనే ఇటీవలే నిహారిక కొణిదెల నిర్మించిన 'Hello World' అనే వెబ్ సిరీస్‌లో నటించి యమా అలరించింది.

Actress Sadha Latest Stunning Photoshoot Viral

బుల్లితెరపై.. వరుసగా: గతంలో మాదిరిగా వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. బుల్లితెరపై మాత్రం సదా ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ మధ్య 'ఢీ' షోలో మెరిసిన ఈ బ్యూటీ.. ఇటీవలే స్టార్ మాలో ప్రసారం అయిన 'బీబీ జోడీ' షోకు జడ్జ్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే అదే ఛానెల్‌లో వచ్చిన 'నీతోనే డ్యాన్స్' అనే షోకు కూడా న్యాయ నిర్ణేతగా పని చేసింది.

అందులో యాక్టివ్‌గా: చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. కొంత కాలంగా పెద్దగా ఆఫర్లను సొంతం చేసుకోలేకపోతున్నా.. హీరోయిన్ సదా మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా వాళ్లను ఖుషీ చేయడంతో పాటు తన రేంజ్‌ను పెంచుకుంటోంది.

Actress Sadha Latest Stunning Photoshoot Viral

సినిమాలకు భిన్నం: రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో సదా పెద్దగా గ్లామర్ రోల్స్ చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం సుదీర్ఘ కాలంగా బోల్డు షో చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది. తద్వారా తరచూ ట్రెండ్ అవుతోంది.

Actress Sadha Latest Stunning Photoshoot Viral

ఫిదా చేసేలా సదా షో: టాలీవుడ్ హీరోయిన్ సదా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ డిజైన్ టాప్ వేసుకుని కొన్ని ఫొటోలను దిగింది. దీంతో ఆమె క్లీవేజ్ ఓ రేంజ్‌లో హైలైట్ అవుతూనే ఉంది. ఫలితంగా సదా తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ చాలా తక్కువ టైంలోనే విపరీతంగా వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X