Just In
- 7 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 8 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 9 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 10 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
హై అలర్ట్.. పంజాబ్, హర్యానా, కొన్ని జిల్లాల్లో మొబైల్ సేవల్ బంద్..
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ స్కిన్ అంటే అంత ఇష్టం.. కొంచెం కనిపించినా జూమ్ చేసి మరీ చూసేస్తా: సాయి పల్లవి
ఫిదా బ్యూటీ సాయి పల్లవి స్టార్ డమ్ తో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకుంది. ఎక్కువగా గ్లామర్ ప్రజెంటేషన్ లేకుండా చాలా కూల్ గా నవ్వుతూ కనిపించే అమ్మడు ఇటీవల కొన్ని హాట్ కామెంట్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబుపై ఆమె చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి.

వరుస ఇంటర్వ్యూలతో బిజీగా..
చాలా కాలం తరువాత వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారుతున్న ఫిదా బ్యూటీ నెక్స్ట్ తన నుంచి రాబోతున్న సినిమాలకు కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇక తనకు ఇష్టమైన లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెబుతూనే మీటూ పై కూడా వివరణ ఇవ్వడం ఇటీవల వైరల్ అయ్యింది.

లిప్ లాక్ సీన్.. మీటూ ఎఫెక్ట్
ఒక దర్శకుడు లిప్ లాక్ సీన్ లో నటించమని అడిగితే వెంటనే నో చెప్పేసిందట. అయితే అప్పటికి షూటింగ్ కు సగం పూర్తవ్వడంతో సడన్ గా దర్శకుడు ఒత్తిడి పెంచాడట. అయితే హీరో కలుగజేసుకొని ఆమెకు ఇష్టం లేనిదే ఇబ్బంది పెట్టవద్దని, మళ్ళీ మీటూ అంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పడంతో గొడవకు ఎండ్ కార్డ్ పడినట్లు వివరణ ఇచ్చింది.

మహేష్ ఎప్పుడైనా అలానే కనిపిస్తాడు
ఇక అదే ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి మాట్లాడిన సాయి పల్లవి మహేష్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టం అంటూ ఆయన అందానికి ఎప్పుడో ఫిదా అయ్యానని తెలిపింది. ముఖ్యంగా మహేష్ స్కిన్ టోన్ ఎలాంటి సందర్భంలో అయినా మెరిసిపోతుందని తెలిపింది.

ఒక మనిషి ఇంత పర్ఫెక్ట్ గా ఎలా ఉంటాడు
ఒక మనిషి ఇంత పర్ఫెక్ట్ గా ఎలా ఉంటాడు అని ఆశ్చర్యపోతుంటాను. మహేష్ ఫొటోలను చాలా వరకు నేను జూమ్ చేసి మరీ చూస్తుంటాను. అప్పుడు ఆయన ముఖం మీద ఒక్క మచ్చ కూడా కనిపించదు. ఎంతో బావుంటారు. అందుకే ఆశ్చర్యపోతాను అంటూ సాయి పల్లవి క్లారిటీగా వివరణ ఇచ్చింది.

యాడ్స్ అందుకే చేయడం లేదు
ఇక యాడ్స్ కు సంబంధించిన ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా రిజెక్ట్ చేసే సాయి పల్లవి అందుకు గల కారణాన్ని కూడా వివరణ ఇచ్చింది. ఒక బ్యూటీ ప్రాడక్ట్ యాడ్ కోసం 2కోట్ల వరకు ఆఫర్ చేసినా కూడా ఫిదా బ్యూటీ ఒప్పుకోలేదట. అందుకు కారణం ఒక మనిషి అందం అవి వాడితే మారుతుందని నేను నమ్మించలేను. నన్ను ప్రేరణగా తీసుకోని మరొకరు అలాంటి ఫాలో అవ్వడం నాకు నచ్చదు. ఒకరకంగా అది మోసమే అని డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేసింది సాయి పల్లవి.