Sai Pallavi: ఏం మాట్లాడినా కాంట్రావర్సీ అవుతోంది.. ఆ వివాదంపై తొలిసారి స్పందిన సాయిపల్లవి..

Sai Pallavi: వండర్ఫుల్, అమేజింగ్ , ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ యాక్టర్ సాయి పల్లవి. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ రోల్ అనే స్థాయి నుండి అంతకుమించి అనేలా ఔచిత్యాన్ని తీసుకువచ్చిన నటి సాయి పల్లవి. తన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ప్రతి పాత్రను తన కోసమే డిజైన్ చేశారా? అనేలా పాత్రలను ఎన్నుకుంటూ.. అంతకుమించి తన అందం, అభినయంతో ప్రేక్షకుల మదిని దోచుకుంటుంది సాయి పల్లవి. అయితే.. ఇటీవల తాను నటించిన అమరన్ మూవీ విడుదల సందర్భంగా ఓ వివాదంలో ఇరుక్కుంది. బాయ్ కాట్ సాయి పల్లవి #Boycottsaipallavi అనే అంతా రేంజ్ వరకు ఆ వివాదం చేరుకుంది. ఈ వివాదంపై తొలిసారి హీరోయిన్ సాయి పల్లవి స్పందించారు. వివరాల్లోకి వెళితే..

సాయిపల్లవి ఇటీవల మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'అమరన్' మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించారు. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించగా.. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మించారు. ఈ మూవీని ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాకు అటు తమిళం, ఇటు తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ బయోపిక్ మూవీ అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానున్నది.

Actress Sai Pallavi responded on the Boycott Sai Pallavi controversy

బాయి కట్ సాయి పల్లవి వివాదం గురించి మాట్లాడుతూ..విరాట పర్వం మూవీ ప్రమోషన్స్ సమయంలో తాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండియన్ ఆర్మీకి పాకిస్థాన్ లో ఉన్న వాళ్లకు టెర్రరిస్టులుగా కనిపించవచ్చు. అలాగే వాళ్లకు మన వాళ్లు కూడా అలానే అనిపిస్తారు కాదా' అంటూ హింస గురించి మాట్లాడననీ, తాను ఇంటెన్షన్ గా ఆ మాటలు అనలేదని, అవి ఫ్లోలో వచ్చాయన్నారు. తాను మాత్రం తప్పుగా ఏమి మాట్లాడలేదనీ, ఈ విషయంలో ఏం జరిగినా తన మంచికే జరుగుతుందని తనకు తాను సర్ది చెప్పుకోవడం తప్ప చేసేదేం లేదంటూ సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.

ప్రపంచ స్థాయిలో రూపొందిస్తున్న ప్రాజెక్ట్ లో తనని సీత పాత్ర నుండి తీసి వేయాలంటూ ట్రోల్ చేయడం కాస్త బాధగా అనిపించిందన్నారు. అయినా.. ఆ ఇంటర్వ్యూలో అంతకు ముందు చాలా విషయాల గురించి చర్చించాననీ, కానీ, ముందు వెనకు కట్ చేసి ఒక పదాన్ని పట్టుకుని కాంట్రవర్సీ చేయడం సరికాదన్నారు.తాను మాట్లాడిన సందర్భం వేరేనని, తన ఇంటెన్షన్ కూడా వేరేనన్నారు.

అయినా.. ఇటీవల తాను ఏం మాట్లాడినా.. ఎలా మాట్లాడినా.. అది కాంట్రవర్సీగా మారుతుందని, ప్రతి విషయంలో కూడా అదే జరిగిందని బాధపడ్డారు. తాను వేరే ఆలోచనతో మాట్లాడలేదు కదా.. తనని ఇలా ఎందుకు ఎక్స్పోజర్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సాయిపల్లవి. తనకు కెమెరా ముందు ఒకలా.. కెమెరా వెనుక మరోలా ఉండటం రాదనీ, ఇండస్ట్రీలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చిందనీ, తన నటన మెచ్చిన అభిమానులు తనను వారి ఇంట్లో అమ్మాయిగా గుర్తిస్తున్నారు. అంతకు మించిన గౌరవం మరోకటి లేదు కదాంటూ సాయిపల్లవి సంతోషం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X