సాయిపల్లవి మేకప్ ఎందుకు వేసుకోదో తెలుసా.. అలాంటి రాత్రి మాత్రమే
దక్షిణాదిన లేడీ పవర్ స్టార్ గా వెలుగొందుతోంది సాయి పల్లవి. నటికి అందమే ముఖ్యం కాదని రుజువు చేసింది. తన నేచురల్ బ్యూటీతోనే సౌత్ ఆడియెన్స్ ను కట్టిపడేసింది. టాలెంటెడ్ హీరోయిన్ గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. డ్యాన్సర్ గా తన కెరీయర్ ను ప్రారంభించి ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో వరస పెట్టి సినిమాలు చేస్తోంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా మరింతగా ఎదుగుతోంది. రాబోయే యంగ్ యాస్పిరెంట్స్ కు స్ఫూర్తిగానూ నిలుస్తోంది. హీరోయిన్లు అంటే అందానికి మాత్రమే ప్రతీక కాదని, తమలోనూ అబ్బురపరిచే టాలెంట్ దాగి ఉందని చెప్పింది.
అయితే, సాయిపల్లవి 2009లో తమిళంలో వచ్చిన ప్రభుదేవా డ్యాన్స్ షోతో టెలివిజన్ రంగంలో దుమ్ములేపింది. ఇటు తెలుగులోనూ ప్రసారమైన ఢీ4 డ్యాన్స్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని తన డ్యాన్స్ తో అదరగొట్టింది. ఫైనల్ వరకు ఆడింది. టైటిల్ ను కొట్టలేకపోయింది. ఇక అంతకు ముందు 2005 నుంచే సినిమాల్లో పని చేస్తూ వస్తోంది. కొరియోగ్రఫర్ గా పలు తమిళ, మలయాళ సినిమాలకు పని చేసింది. ఇక మలయాళంలోని 'ప్రేమమ్' చిత్రంతో హీరోయిన్ గానూ మెప్పించింది. తన తొలిచిత్రంతోనే మతులు పోగొట్టింది.

ఇక 2017లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందించింది. ఆ తర్వాత కణం, పడి పడి లేచే మనస్సు, మారి 2, ఎన్టీకే, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, అమరాన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వరుస హిట్లను సొంతం చేసుకొని ఇండస్ట్రీలో మరింత సెన్సేషన్ గా మారింది. రీసెంట్ గా సాయి పల్లవి తెలుగులో 'తండేల్' చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. నాగచైతన్య సరసన నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100కు పైగా వసూళ్లు సాధించింది.
అయితే, తన కెరీయర్ లో తమిళం, మలయాళం, తెలుగుతో కలిసి 15కు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఏ ఒక్క సినిమాలోనూ మేకప్ వేసుకునేందుకు ఇష్టపడలేదంట సాయిపల్లవి. ఇక తాజాగా తన మేకప్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ గా మారింది. తన సినిమాలకు ఎక్కువ గా మేకప్ వాడడని, మినిమల్ మేకప్ తోనే సినిమలు చేశానని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. కరోనా తర్వాత 2022లో వచ్చిన 'విరాట పర్వం' చిత్రంలో అస్సలు మేకప్ వాడలేదని, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని షూట్ కు హాజరైందంట.
తను బ్యూటీ ప్రాడక్ట్స్ ఏమీ వాడదు. కేవలం రాత్రి సమయంలో జరిగే షూటింగ్స్ లో మాత్రమే రెండు ప్రాడక్ట్స్ వాడుతుంది. అది కూడా ఐ లైనర్, మాయిశ్చరైజర్. తన కళ్లు చీకట్లో బాగా కనిపించాలని మాత్రమే వాడుతుందంట. ఇలా మేకప్ వాడకుండానే హీరోయిన్ గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. నటికి మేకప్ ముఖ్యంగా కాదని, నటనే ప్రధానమని రుజువు చేసింది. ఇక నెక్ట్స్ సాయి పల్లవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఏక్ దిన్, రామాయణ : పార్ట్ 1 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











