బ్రేకప్ అయి విడాకులు తీసుకోకుంటే.. నా లైఫ్ మరో సావిత్రి బయోపిక్: సమంత సంచలన వ్యాఖ్యలు

మహానటి సావిత్రి.. తరాలు మారినా, ఏళ్లు గడుస్తున్నా తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం పొందిన కళాత్మక మహిళా మర్తి. ఆ పేరును తలచుకోగానే తెలుగుదనం , నిండైన విగ్రహం మూర్తీభవించిన వ్యక్తి సావిత్రి. ఆమె తర్వాత ఎంతో మంది ప్రతిభావంతులైన నటీమణులు వచ్చినా.. సావిత్రితో ఎవ్వరినీ పోల్చలేని స్థాయి ఆమెది. ఎందుకంటే నటనారంగంలో ఆమె వేసిన ముద్ర అలాంటిది. నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్న వెండితెర సామ్రాజ్ఞి సావిత్రి.

నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు తెరపై చెరగని ముద్రవేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి సావిత్రి. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన సావిత్రికి వ్యక్తిగత జీవితం మాత్రం విషాదాలమయం. చిన్న వయసులో తండ్రి లేక పెద్దమ్మ, పెదనాన్నల వద్ద పెరగడం నుంచి ప్రేమ, పెళ్లి వరకు ఎన్నెన్నో మలుపులు. రెండో పెళ్లి వాడైన జెమిని గణేషన్‌ను పెళ్లాడారు. లక్షల రూపాయాల రెమ్యూనరేషన్, బంగళాలు, కార్లు విలసవంతమైన జీవితాన్ని అనుభవించిన సావిత్రి.. జీవిత చరమాంకంలో తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు.

actress samantha made sensational comments on mahanati savitri life

చివరి రోజుల్లో జీవితపు నావను నడపటం కోసం చిన్న చిన్న వేషాలైనా ఒప్పుకున్నారు. కష్టాలను, గుండెల్లో గూడుకట్టుకున్న బాధను మరిచిపోవడానికి వ్యసనాలకు బానిసగా మారారు . ఆస్తులను, అయినవారిని, సినిమాల్లో అవకాశాలను అన్నింటిని పోగొట్టుకుని జీవచ్ఛవంలా ఓ రోజున హఠాత్తుగా కోమాలోకి జారిపోయారు. ఎన్నో నెలల పాటు ఆసుపత్రిలో కోమాలో ఉండి చివరికి 1981 డిసెంబర్ 26న సావిత్రి కన్నుమూశారు. దాంతో తెలుగు సినీ చరిత్రలో ఒక శకం ముగిసినట్లయ్యింది.

అయితే సావిత్రి ఇంత విషాదాన్ని అనుభవించడానికి ఆమె భర్త జెమినీ గణేషనే కారణమని ఫిలింనగర్‌లో ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. జెమినీ మరో యువతితో తిరగడం చూసి తట్టుకోలేకపోవడంతో పాటు చిత్ర నిర్మాణం విషయంలో ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు .. ఇలా అన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో సావిత్రి గుక్కతిప్పుకోలేకపోయారని ఆమెతో పాటు నటించిన వారు, సన్నిహితులు ఇప్పటికీ అంటూ ఉంటారు. ఆమె నటన, జీవితం ఒక గ్రంథాలయం.. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వారు నటన, వ్యక్తిత్వం, జీవితంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో సావత్రిని చూసి నేర్చుకోమని చెబుతుంటారు.

actress samantha made sensational comments on mahanati savitri life

అప్పటికే వివాహమై, భార్యాపిల్లలు ఉన్న జెమినీ గణేషన్‌ను పెళ్లాడకుండా ఉండి ఉంటే .. అయినవాళ్లను నమ్మకుండా ఉండి ఉంటే సావిత్రి జీవితం మరోలా ఉండేదని అనుకుంటూ ఉంటారు. ఈ సంగతి పక్కనబెడితే.. తన జీవితం కూడా సావిత్రిలా అయ్యేదని, కానీ తృటిలో తప్పించుకున్నానని అగ్ర కథానాయిక సమంత ఒక సందర్భంలో చెప్పడం దుమారం రేపింది. సావిత్రి గురించి తనకు పెద్దగా తెలీదని.. ఈ సినిమా చూశాక చాలా విషయాలు అర్ధమయ్యాయని.. ప్రేమ విషయంలో ఓ సారి తానూ అలాగే నమ్మాననని .. కానీ లక్కీగా తప్పించుకున్నానని సమంత వెల్లడించారు. లేదంటే తన కథా సావిత్రిలాగే అయ్యేదని ఆమె వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత కూడా సావిత్రి మాదిరిగానే ఎవరినైనా నమ్మిందా.. చివరికి అతడి నిజస్వరూపం తెలిసి ఆ బంధం నుంచి తప్పించుకుందా అంటూ రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X