Samantha Ruth Prabhu: గతాన్ని తలచుకుంటూ దేవుని ముందు సమంత.. ఆ బాధపై ఏమోషనల్ నోట్!

హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నాగ చైతన్యతో ప్రేమ వివాహం తర్వాత మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ... చివరకు తన వివాహ బంధానికి విడాకులతో పుల్ స్టాప్ పెట్టింది.

ఆ వ్యాధి శారీరకంగా చాలా కుంగదీసింది:ఆ తర్వాత కొద్ది రోజులకే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడినట్లు తెలిపింది. అప్పటికే వ్యక్తిగత సమస్యలతో మానసికంగా చాలా వీక్ గా మారిపోయిన సమంతను... ఆ వ్యాధి శారీరకంగా చాలా కుంగదీసింది. ఏడాది పాటు రకరకాల చికిత్సల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంది సమంత. ఇటీవల సమంత యశోద, శకుంతలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అవి ఆశించినంత స్థాయిలో విజయం పొందలేదు.

Actress Samantha Ruth prabhu emotional note viral

ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా..:సినిమాలు ప్లాప్ అయినా కూడా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతోంది. ఇక ప్రస్తుతం సెర్బియాలో ఉన్న సామ్‌ తాజాగా ఓ ప్రార్థనామందిరానికి వెళ్లి, పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ మయోసైటిస్‌ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ తన లైఫ్‌ జర్నీ ఎలా సాగిందో తెలియజెప్పారు.

కొత్త జీవితంలోకి అడుగుపెట్టి..:ఇస్టాగ్రామ్ లో రాస్తూ... వ్యాధిని నిర్ధారించి, బలవంతంగా కొత్త సాధారణ జీవితంలోకి అడుగుపెట్టి ఏడాది అవుతోంది. శారీరకంగా ఎన్నో పోరాటాలు చేశా. ఆహారపు అలవాట్ల విషయంలోనూ ఇష్టమైన వాటిని బలవంతంగా వదులుకున్నా. ఇంకొన్నింటిని కొత్తగా ఆరంభించా. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన పరాజయాల విషయంలోనూ ఆత్మపరిశీలన చేసుకున్నా. పరిస్థితులను మెరుగుపరచమని కోరుతూ దేవుడికి ఎన్నో ప్రార్థనలు చేశానని పేర్కొంది.

Actress Samantha Ruth prabhu emotional note viral

ధైర్యాన్ని, ప్రశాంతతను అందించమని పూజలు:ఇక విలువైన బహుమతులు, ఆశీస్సులు ఇవ్వమని ఎప్పుడూ కోరలేదని సమంత రాసుకొచ్చింది. కేవలం, ధైర్యాన్ని, ప్రశాంతతను అందించమని పూజలు చేశా. అన్ని సమయాల్లో మనం అనుకున్న విధంగా అన్నీ జరగవని ఈ ఏడాది నాకు తెలియజేసింది. మరీ ముఖ్యంగా, పరిస్థితులు మనకు అనుగుణంగా లేకపోయినా ఫర్వాలేదని తెలుసుకున్నా. నేను కంట్రోల్‌ చేయగలిగే అంశాలనే కంట్రోల్‌ చేయాలి.

గొప్ప విజయాలు అక్కర్లేదు..:మిగిలిన వాటిని అలాగే వదిలేసి, ముందుకు సాగిపోవాలి. కొన్నిసార్లు గొప్ప విజయాలు అక్కర్లేదు. పరిస్థితి నుంచి బయటకు అడుగుపెట్టడం కూడా ఒక విజయమే. పరిస్థితులు తిరిగి మెరుగుపడతాయని.. నేను ఎవరినైతే ఇష్టపడతానో వారి ప్రేమలో ఉండాలనుకుంటున్నా. నన్ను ఇబ్బందిపెట్టే అవకాశాన్ని ద్వేషానికి ఇవ్వకూడదు. ఇక్కడ ఎంతోమంది క్లిష్టమైన పరిస్థితులతో పోరాటం చేస్తున్నారు.'' సమంతా ఓ సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చింది. ప్రస్తుతం సామ్... హిందీ వెబ్ సిరీస్ సిటడెల్ లో నటిస్తోంది. అటు విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో కూడా నటిస్తోంది. ఈ రెండు తన కెరియర్ కు ప్లస్ అవుతాయని అంతా అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X