ఈ సమయంలో ఆయన లేడే.. గ్యాప్‌ను అలా పూడ్చుకొన్న సమంత.. పోస్ట్ ట్రెండింగ్
కొద్దినెలలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల సైలెంట్‌గా నిశ్చితార్ధం చేసుకుని షాకిచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ను నాగార్జున అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. త్వరలోనే రాజస్థాన్ లేదా మధ్యప్రదేశ్‌లలోని ఏదో ఒక రాయల్ ప్యాలెస్‌లో వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లను ప్రారంభించారు. త్వరలోనే పెళ్లి వేదిక, ముహూర్తం తదితర వివరాలపై అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ నేపథ్యంలో సమంత పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె సోషల్ మీడియాలో ఏం పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా సామ్ ఇన్‌స్టా పోస్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఎంతో ఇష్టపడి , సుధీర్ఘకాలం డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో విడాకులవ్వడాన్ని సమంత తట్టుకోలేకపోయింది. చాలా రోజుల పాటు డిప్రెషన్‌లో ఉండిపోయిన సామ్.. పర్సనల్ లైఫ్‌లో వచ్చిన ఇబ్బందులను అధిగమించడానికి విహారయాత్రలకు , ఫారిన్ టూర్లకు వెళ్లింది. పనిలో పడితేనైనా బాధను మరచిపోతానేమోనన్న ఉద్దేశంతో సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిస్ధితులు కుదుటపడుతున్న దశలో మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడ్డారు సమంత.

దీనికి ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే , కమిటైన సినిమాలు కంప్లీట్ చేశారు. హెల్త్‌ను కాపాడుకుంటూనే, ఆధ్యాత్మిక సేవలో సేదతీరారు సమంత. కోయంబత్తూరులోని సద్గురు జగ్గీవాసుదేవ్ ఆశ్రమంలో గడుపుతూ రీఛార్జ్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో తన మాజీ నాగచైతన్య శోభిత అనే అమ్మాయిని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని తెలిసి ఎలా రియాక్ట్ అవుతోందనని ప్రేక్షకులు ఎదురుచూశారు. అయితే ఆమె కూడా పెళ్లయిన డైరెక్టర్‌తో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని.. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారన్నది గాసిప్స్ వైరల్ అయ్యాయి.
ఫ్యామిలీ మెన్ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్ నిడుమోర్‌తో సామ్ డేటింగ్‌లో ఉన్నట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే రాజ్ నిడుమోరు తెలుగువారేనట. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఆయన స్వస్థలమట. హీరోయిన్‌గా అంతగా అవకాశాలు రాకపోయినా.. తన మనసుకు నచ్చిన సినిమాలే చేస్తున్నారు సామ్. ఇంత జరిగినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆగస్ట్ నెల వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ ఎవరంటూ ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో సమంత అగ్రస్థానంలో నిలిచారు.
https://www.instagram.com/stories/samantharuthprabhuoffl/3465041960805553828/?hl=en
ఇదిలాఉండగా.. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామ్ లేటెస్ట్‌గా నటించిన వెబ్‌సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ . ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటించగా.. రాజ్ డీకే దర్శకత్వం వహించారు. త్వరలోనే ఇది ఓటీటీలో అందుబాటులోకి రానుంది. లాంగ్ గ్యాప్ తర్వాత సామ్‌ని స్క్రీన్‌పై చూస్తుండటంతో ఆమె అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్‌ను లండన్‌లో ప్రదర్శించారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్‌కు వరుణ్ దూరంగా ఉండటంతో సామ్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. దీంతో ఆయనను మిస్ అవుతున్నానని సమంత పోస్ట్ చేశారు. అక్కడితో ఆగితే ఏముండేది కాదు.. కానీ మిస్సింగ్ మై మేన్ వరుణ్ ధావన్ అనే క్యాప్షన్ పెట్టడంతో ఈ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











