ప్రాణం కంటే మిన్నగా ప్రేమించినా.. వాళ్ల నుంచి అది దక్కదు.. సమంత షాకింగ్ పోస్ట్
కొద్దినెలలుగా మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల సైలెంట్‌గా నిశ్చితార్ధం చేసుకుని ఇండస్ట్రీకి, అభిమానులకు షాకిచ్చారు. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ను నాగార్జున అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఆశీర్వదిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో లేదంటే సమ్మర్‌లో ఈ జంట పెళ్లి పీటలెక్కనుందని టాక్. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని భావిస్తోన్న చై , శోభితలు కోరుకుంటుండటంతో ఇరు కుటుంబాల పెద్దలు అందుకు తగ్గ స్పాట్‌ను వెతుకుతున్నారు. ఇండియాలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కేరాఫ్‌గా నిలిచే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోని విలాసవంతమైన ప్యాలెస్‌లలో వీరి వివాహం జరుగుతుందని ఫిలింనగర్ టాక్.
విడాకుల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నాగచైతన్య .. ఒంటరిగా జీవితాన్ని లీడ్ చేయలేమని తొందరగానే గ్రహించి మరో అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించారు. మరి సమంత పరిస్ధితేంటీ అంటూ విపరీతంగా చర్చ జరుగుతోంది. చైతన్యతో విడాకులయ్యాక సమంత డిప్రెషన్‌లోకి వెళ్లిందని సన్నిహితులు చెబుతుంటారు. మధ్యలో మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడ్డారు సమంత. దీనికి చికిత్స తీసుకుంటూనే , సినిమాలను కూడా వేగంగా కంప్లీట్ చేశారు. మెంటల్‌గా రీఛార్జ్ కావడానికి ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయారు సామ్. తన వయసు, స్టార్‌డమ్‌కు తగ్గట్లుగా కథాబలం ఉన్న సినిమాలకి ఓకే చెబుతూ లైఫ్ లీడ్ చేస్తున్న దశలో చైతన్య ఎంగేజ్‌మెంట్ ఆమెను షాక్‌కు గురిచేసింది.

అయితే సమంత కూడా ఆల్రెడీ ఒకరితో ప్రేమలో పడ్డారని , త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా పుకార్లు చక్కర్లు కొట్టాయి. ది ఫ్యామిలీ మెన్ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్ నిడుమోరితో సామ్ డేటింగ్‌లో ఉన్నట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య చాలా ఏళ్లుగా ప్రేమాయణం సాగుతోందని.. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తర్వాతే చైతూకి సమంత విడాకులు ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. రాజ్ నిడుమోరు తెలుగువారేనట. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఆయన స్వస్థలమట.
కొద్దిరోజుల క్రితం సంథింగ్ స్పెషల్ రాబోతోంది.. స్టే ట్యూన్డ్ అంటూ పోస్ట్ పెట్టడంతో పాటు వాడిపోయిన ఆకులున్న కొమ్మను ఫోటోను జత చేసింది. దీంతో సమంత ఏం చెప్పబోతోంది.. బహుశా ఎంగేజ్‌మెంట్ , కొత్త బాయ్ ఫ్రెండ్ వివరాలు షేర్ చేస్తుందా అంటూ ఎన్నో ఊహాగానాలు చక్కర్లుకొట్టాయి. ముంబైలో జరిగిన వరల్డ్ పికిల్ బాల్ లీగ్ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆమె చెన్నై ఫ్రాంఛైజీని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.

నాగచైతన్య - శోభితల ఎంగేజ్‌మెంట్ జరిగినప్పటి నుంచి సమంత ఏ పోస్ట్ పెట్టినా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో రాసుకొచ్చిన మాటలు వైరల్ అవుతున్నాయి. కొందరు వ్యక్తులు స్నేహాన్ని, రిలేషన్‌షిప్‌ను సమానంగా చూస్తారని భావించా, కానీ కొన్నేళ్లుగా నేనో విషయం నేర్చుకున్నా, ప్రేమ ఒక త్యాగం.. కొన్నిసార్లు మీరు ప్రేమనే పంచినా ఇతరులు తిరిగివ్వరు, నువ్వు ఇస్తేనే నేను ఇస్తా అనేలా పరిస్థితి మారిపోతుందని సమంత పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎవరిని ఉద్దేశించి సామ్ ఈ కొటేషన్ రాసుకొచ్చిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











