samantha: వ్యాపారంలో నష్టపోయిన సమంత.. అయినా రిస్క్‌తో కొత్త బిజినెస్‌లోకి..!

ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇటీవలి కాలంలో బిజినెస్ వెంచర్‌లలో విజయం సాధిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా పోగొట్టుకున్న చాలా మంది ఇతర నటీమణుల మాదిరిగా కాకుండా, సమంత వివిధ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా తన సంపదను పెంచుకోగలిగింది. అయితే ఆ మధ్య మాత్రం సమంత రిస్క్ తీసుకొని చేసిన బిజినెస్ గట్టిగానే దెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

చాలా కాలంగా

చాలా కాలంగా

సమంతా చాలా కాలంగా ఈ-కామర్స్ దుస్తుల వ్యాపారంలో సాకి అనే బ్రాండ్ తో బిజినెస్ చేస్తోంది. ఇక అది ప్రారంభించిన అనంతరం అంతా బాగానే ఉంది. దీనితో పాటు, ఆమె హైదరాబాద్‌లోని పిల్లల కోసం ఒక కాన్సెప్ట్ స్కూల్‌లో కూడా పెట్టుబడి పెట్టిందట. ఇది ఆమె మనసుకు దగ్గరైన ప్రత్యేకమైన వెంచర్ అని తెలుస్తోంది. సమంత వీలయినంత వరకు సంపాదించిన దాంట్లో కొంత ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తోంది.

నష్టపోయిందట

నష్టపోయిందట

అయితే, సేంద్రియ కూరగాయలు పండించే టెర్రస్ గార్డెన్ వ్యాపారం కూడా సమంత ఆ మధ్య స్టార్ట్ చేసినట్లు టాక్ వచ్చింది. ఇటీవల కాలంలో ఇలాంటి బిజినెస్ ఎవరు చేయాలని అంత రిస్క్ తీసుకోరు కానీ సమంత కాస్త ఎక్కువగానే పెట్టుబడి పెట్టిందట. కానీ ఆ వ్యాపారంలో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదట. దని ద్వారా ఆమె నష్టపోయిందని పుకార్లు కూడా వ్యాపించాయి. ఇక దాన్ని ఎక్కువ కాలం కొనసాగించకుండా అమ్మడు మరో దానిపై ఫోకస్ చేసిందట.

ఎదురుదెబ్బ తగిలినప్పటికి

ఎదురుదెబ్బ తగిలినప్పటికి

అలా ఒక ఎదురుదెబ్బ తగిలినప్పటికి, సమంతా సూపర్‌ఫుడ్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడంతో అక్కడ ఆమె ప్లాన్ విజయవంతమైందట. ఆమె ఒక కంపెనీలో భాగస్వామిగా చేరి భారీ పెట్టుబడిదారుగా కూడా మారినట్లు తెలుస్తోంది. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోని తన స్నేహితుల ద్వారా ఈ వ్యాపారంను బాగా ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అనేక పెట్టుబడులు

అనేక పెట్టుబడులు

ఇక కాజల్ అగర్వాల్, తమన్నా వంటి ఇతర నటీమణులు ఆన్‌లైన్‌లో నగల వ్యాపారాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ వారు ఎక్కువ కాలం వాటిని కొనసాగించడంలో విఫలమయ్యారు. లాభం ఉంటుందని అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. కానీ దీనికి విరుద్ధంగా, సమంత ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న అనేక వ్యాపారాలలో పెట్టుబడి పెట్టింది. చెన్నైలో కాలేజీ రోజుల్లో ఆమె చదువుకున్న బిజినెస్ ఐడియాలను ఇప్పుడు గట్టిగానే ఫాలో అవుతున్నట్లు అర్ధమవుతోంది.

సినిమాలతోనే కాకుండా

సినిమాలతోనే కాకుండా

సమంత కేవలం సినిమాలతోనే కాకుండా వివిధ రకాల కమర్షియల్ యాడ్స్ ల ద్వారా కూడా మంచి ఆదాయాన్ని అయితే అందుకుంటోంది. ఇక ఇప్పుడు అలా సంపాదించిన డబ్బుతో ఆమె వివిధ రకాల భిన్నమైన బిజినెస్ లలో.పెట్టుబడులు పెడుతోంది. ఇక ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదల కాబోతున్న ఆ సినిమా ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X