హాట్ వర్కౌట్‌తో సమంత సెన్సేషన్: స్పోర్ట్స్ బ్రాలో అలా పడుకుని మరీ!
సమంత రూత్ ప్రభు.. ఈ పేరుకు అస్సలు పరిచయం అవసరం లేదు. అంతలా ఈ సుందరాంగి సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తనదైన రీతిలో హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. అంతేకాదు, దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ ప్రభావాన్ని చూపిస్తూ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. తద్వారా తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటూనే ఉంది. ఇక, సోషల్ మీడియాలోనూ యమ సందడి చేస్తోన్న సమంత.. తాజాగా ఓ హాట్ వర్కౌట్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దాన్ని మీరే చూసేయండి మరి!

సామ్ అప్పుడలా.. ఇప్పుడలా
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ప్రేక్షకులను ఫిదా చేసేసిన సమంత.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. దీంతో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆమె పూర్తిగా వైవిధ్యంగా సాగిపోతోంది. ఇందులో భాగంగానే గ్లామర్ పాత్రలు తగ్గించి పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే చేసుకుంటోంది.

జాతీయ స్థాయి.. ఆ సిరీస్‌లో
చాలా కాలం పాటు సౌత్ ఇండస్ట్రీల్లో సత్తా చాటిన సమంత రూత్ ప్రభు.. గత ఏడాది 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్ర బాగా హైలైట్ అవడంతో నేషనల్ రేంజ్ ఎదిగింది. దీంతో ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్‌లో 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. దీన్ని దాదాపుగా పూర్తి చేసింది.

యశోద తర్వాత శాకుంతలగా
గత ఏడాది స్టార్ హీరోయిన్ సమంత 'యశోద' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే, ఆమె గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న 'శాకుంతలం' మూవీని పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు.

ఖుషితో పాటు వాటిలో కూడా
సమంత రూత్ ప్రభు ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' అనే మూవీలోనూ చేస్తోంది. అలాగే, కోలీవుడ్ స్టార్ విజయ్‌తో ఓ సినిమాను చేస్తుంది. వీటితో పాటు BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ డైరెక్షన్‌లో వెబ్ ఫిల్మ్ కూడా చేయనుంది. ఇవి మాత్రమే కాదు.. ఈ చిన్నది సౌత్ నుంచి నార్త్ వరకూ ఎన్నో ప్రాజెక్టుల్లో భాగం అవుతోంది. దీంతో ఫుల్ బిజీగానే గడుపుతోంది.

అందులో కూడా యాక్టివ్‌గానే
దాదాపు పదేళ్లుగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నా.. సమంత మాత్రం సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా సుదీర్ఘ కాలంగా తనదైన రీతిలో నెటిజన్లను అలరిస్తూ ఫాలోయింగ్‌ను బాగా పెంచుకుంటోంది.

అప్పటి నుంచి జిమ్‌లోనూ
సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడుతోన్న విషయం తెలిసిందే. దీని నుంచి కోలుకునేందుకు చాలా రోజుల పాటు చికిత్సను తీసుకున్న ఈ అమ్మడు.. జిమ్‌లో వర్కౌట్లను కూడా బాగా పెంచేసింది. ఇందులో భాగంగానే కొంత కాలంగా ఫిట్‌గా మారేందుకు చెమటలు చిందిస్తూ కష్టపడుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె షేర్ చేస్తోంది.

సమంత వర్కౌట్ పిక్ వైరల్
సోషల్ మీడయాలో తెగ హడావిడి చేస్తోన్న సమంత రూత్ ప్రభు.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వర్కౌట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్పోర్ట్స్ బ్రా, ట్రాక్ వేసుకుని కసరత్తులు చేస్తోంది. ఇందులో సమంత ఫిజిక్ మొత్తం కనిపిస్తోంది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇవి విపరీతంగా వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











