Samantha Ruth Prabhu : ఆ ఇద్దరి వల్ల ఎంత ఏడ్చానో .. సంచలన విషయం బయటపెట్టిన సమంత
సామాన్య కుటుంబంలో పుట్టి కెరీర్‌లో ఉన్నత స్థితికి చేరుకున్నారు 'సినీ నటి సమంత. జీవితంలో ఎన్నో కష్టాలు తట్టుకుని నిలబడి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఎంతో మంది హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిపోగా.. తాను మాత్రం దేశంలోని బిజీ హీరోయిన్లలలో ఒకరిగా కొనసాగుతున్నారు. సినిమా కోసం ప్రాణం పెట్టే సమంతను ఓ ఇద్దరు దర్శకులు వేధించారట. ఈ వివరాల్లోకి వెళితే..
ఒకప్పుడు కుటుంబంలో ఆర్ధిక సమస్యల కారణంగా ఇంటి పోషణ నిమిత్తం చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన సమంత కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఇదంతా రాత్రికి రాత్రి వచ్చింది కాదు.. దీని వెనుక ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఉన్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన ఏమాయ చేశావేతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు సామ్ . ఈ సినిమాలో జెస్సీగా ఆమె నటన , క్యూట్ లుక్స్ కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది.

ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో వెంటనే ఎన్టీఆర్, మహేశ్ బాబు , పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. ఆవిడ నటించే ప్రతి సినిమా హిట్ కావడంతో గోల్డెన్ హ్యాండ్ అనిపించుకుని, అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా అవతరించారు. తెలుగులో వచ్చిన స్టార్‌డమ్‌తో కోలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్ట్‌ల్ని అందుకుని అక్కడా తన హవా సాగించింది. విజయ్, అజిత్, సూర్య వంటి స్టార్స్‌తో నటించే అవకాశం దక్కించుకుంది.
ఏమాయ చేశావే సినిమా షూటింగ్ సమయంలో తన కో స్టార్ అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత ఆయనతో సుదీర్ఘకాలం డేటింగ్ చేశారు. ఆ తర్వాత 2017లో పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. కానీ నాలుగేళ్లు తిరిగేసరికి వ్యక్తిగత కారణాలతో సమంత - చైతన్య విడిపోయారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలతో శారీరకంగా మానసికంగా కృంగిపోయిన సమంతను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి మరింత బాధించింది. దీనికి చికిత్స తీసుకుని కోలుకున్న ఆమె తిరిగి సినిమాలలో బిజీ అయ్యారు.
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. రాజ్ అండ్ డీకేల కారణంగా తాను షూటింగ్‌లో ఏడ్చేశానని తెలిపారు. దక్షిణాదిలో తాను నటించిన సినిమాలు రోజుకు రెండు లేదా మూడు సీన్స్ తీసేశారని.. కానీ రాజ్ అండ్ డీకేలు గంటలోనే ఆ సీన్స్ చిత్రీకరించారని సమంత అన్నారు. ఈ దెబ్బతో మేనేజర్‌కు ఫోన్ చేసి.. తన వల్ల కావడం లేదని ఏడ్చేశానని చెప్పారు . తర్వాత వారిద్దరి మేకింగ్‌కు తాను అలవాటు పడ్డానని సమంత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











