Samantha: ప్యాంట్ వేసుకోవడం మరిచిన సమంత .. ఇలాంటి డ్రెస్‌లో ఎప్పుడైనా చూశారా?

అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత తన సినిమాలు, తన జీవితం, తనదైన లోకంలో బతుకుతున్నారు సమంత. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా.. లోపల భరించలేనంత బాధ ఉందని అర్ధమవుతూనే ఉంది. ఇటీవల తన మాజీ భర్త నాగచైతన్య మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని త్వరలోనే ఆమె మెడలో మూడు మూళ్లు వేయనున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సామ్ ఎలా రియాక్ట్ అవుతారోనని జనాలు భావించారు. కానీ ఆమె ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా యూరప్‌లో ఉన్నారు సామ్. ఈ వివరాల్లోకి వెళితే..

నాగచైతన్య మరో తోడును వెతుక్కున్నట్లుగానే సమంత కూడా మరో వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానిస్తారా అనే చర్చ ఇటీవలి కాలంలో ఎక్కువైంది. దీ ఫ్యామిలీ మెన్ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్ నిడుమోర్‌తో సామ్ డేటింగ్‌లో ఉన్నట్లుగా వార్తలు రావడం వీటికి మరింత బలాన్ని చేకూర్చినట్లయ్యింది . రాజ్ నిడుమోరు తెలుగువారేనట. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఆయన స్వస్థలమట. గతంలో మాదిరిగా సినిమాలు చేయకపోయినా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆగస్ట్ నెల వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ ఎవరంటూ ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో సమంత అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటారు.

actress samantha ruth prabhu new photoshoot with black and white dress photos goes viral

సామ్ లేటెస్ట్‌గా నటించిన వెబ్‌సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ . ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌ సరసన సమంత నటించగా.. రాజ్ డీకే దర్శకత్వం వహించారు. త్వరలోనే ఇది ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్‌ను లండన్‌లో ప్రదర్శించారు మేకర్స్. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో సామ్ చురుగ్గా పాల్గొంటున్నారు. మొన్నామధ్య డస్కీ బ్యూటీ ప్రియాంక చోప్రా చిత్ర యూనిట్‌ని కలిసి వారికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఆమె రాకతో ఈ వెబ్‌సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆమెతో పాటు చిత్ర యూనిట్ ఇంకా లండన్‌లోనే ఉందని టాక్. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. వీటికి క్యాప్షన్‌గా బిగిన్స్.. లెట్స్ గో అనే క్యాప్షన్ పెట్టడంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇది చూసిన నెటిజన్లు కొత్త జీవితం స్టార్ట్ చేశావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది సిటాడెల్ హనీ బన్నీ మూవీ గురించేనని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ సిరీస్ కనుక సక్సెస్ అయితే సమంత కెరీర్‌కు మంచి బూస్టప్ ఇచ్చినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.

ఇకపోతే.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటారు సమంత. సినిమాలు, వ్యక్తిగత విషయాలు, ఇతర సంగతులను ఆమె పంచుకుంటూ ఉంటారు. సమకాలీన అంశాలపైనా తన అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం, మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన హేమ కమిటీ రిపోర్ట్స్‌పై ఆమె స్పందించారు. హాట్ హాట్ ఫోటో షూట్‌లలో పాల్గొని చాలాకాలం అయ్యిందని అనుకుందో ఏమో కానీ.. సామ్ మోడర్న్ డ్రెస్సుల్లో హల్ చల్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉన్న ఓ మోడ్రన్ డ్రెస్ వేసుకుని థైస్ చూపిస్తున్న సమంత ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: samantha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X