Samantha Ruth Prabhu : వైరలవుతున్న సమంత వీడియో..! టీనేజ్ లో అలా చేస్తూ

సామాన్య కుటుంబంలో పుట్టి స్టార్ హీరోయిన్‌‌గా ఎదిగారు సినీ నటి సమంత. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు. తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఎంతో మంది భామలు ఫేడ్ అవుట్ అయిపోగా.. సమంత మాత్రం దేశంలోని స్టార్ హీరోయిన్లలలో ఒకరిగా నేటికీ వెలుగొందుతున్నారు. ఒకప్పుడు ఆర్ధిక సమస్యల కారణంగా ఇంటి పోషణ నిమిత్తం చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన సమంత ఇప్పుడు సంపన్నురాలు. ఇదంతా రాత్రికి రాత్రి వచ్చింది కాదు.. దీని వెనుక ఎంతో కష్టం ఉంది.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన ఏమాయ చేశావేతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు సమంత . ఈ సినిమాలో జెస్సీగా ఆమె నటన , క్యూట్ లుక్స్ కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది. ఈ మూవీతో తెలుగులో ఆమె బలంగా జెండా పాతాలని డిసైడ్ అయ్యింది. ఎన్టీఆర్, మహేశ్ బాబు , పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేయడమే కాదు.. తాను నటించిన ప్రతి సినిమా హిట్ కావడంతో లక్కీ హ్యాండ్ అన్న ట్యాగ్ దక్కించుకున్నారు.

actress Samantha Ruth Prabhu old video goes viral in social media

సెంటిమెంట్స్ వెంట నడిచే తెలుగు చిత్ర పరిశ్రమ సమంతను నెత్తిన పెట్టుకుంది. టాలీవుడ్‌తో పాటు తమిళ్‌లోనూ హిట్ చిత్రాల్లో నటించి అక్కడా తన హవా సాగించింది. ఏమాయ చేశావే సినిమా షూటింగ్ సమయంలో తన కో స్టార్ అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత 2017లో పెద్దల అంగీకారంతో ఆయనను పెళ్లాడింది. కానీ నాలుగేళ్లు తిరిగేసరికి వ్యక్తిగత కారణాలతో సమంత - చైతన్య విడిపోయారు.

చైతూతో విడాకుల తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిన సమంతను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి మరింత బాధించింది. దీనికి చికిత్స తీసుకుని కోలుకున్న ఆమె తిరిగి సినిమాలలో బిజీ అయ్యారు. బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓటీటీలలో ఈ మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. జీవితంలో తల్లిని కావాలని అనుకుంటూ ఉంటానని, అదో అద్భుతమైన అనుభవమని సమంత ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలాఉండగా.. అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహం నేపథ్యంలో సమంత ఏం చేసినా చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌‌గా మారుతోంది. తాజాగా సామ్‌కు సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. కాలేజ్ రోజుల్లో ఆమె కొన్ని సంస్థలకు బ్రాండింగ్ చేశారు. అలా ఓ పౌడర్‌ను ప్రమోట్ చేసే వాణిజ్య ప్రకటనలో సమంత కనిపించారు . అదే ఈ వీడియో. లేత అందాలతో చూడటానికి ఎంతో క్యూట్‌గా ఉన్న సమంతను చూస్తే జనం గుర్తుపట్టడం కష్టం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం సమంత టీనేజ్ వీడియోను మీరూ చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X