Samantha: మరో ఇంటిది కాబోతున్న సమంత.. విడాకుల తర్వాత సంచలన నిర్ణయం.. అసలు మేటర్ ఇదే!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయం అయినప్పటికీ.. అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను అందుకుని హవాను చూపించారు. అలాంటి వారిలో టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు ఒకరు. మొదటి చిత్రం నుంచే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది.
అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఇక, విడాకులు తీసుకున్న తర్వాత సామ్ మరింత స్పీడు పెంచేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడామె ఓ సంచలన నిర్ణయం తీసుకుందని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

విడాకుల తర్వాత మరింత స్పీడ్
హీరోయిన్‌గా పరిచయం అయిన తొలినాళ్లలో సమంత రూత్ ప్రభు ఎక్కువగా గ్లామరస్ రోల్స్‌కే ప్రాధాన్యత ఇచ్చేది. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఆమె పంథాను మార్చుకుంది. అప్పటి నుంచి తన పాత్రకు ప్రాధాన్య ఉన్న సినిమాల్లోనే నటిస్తోంది. మరీ ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ఇక, విడాకుల తర్వాత స్పీడు పెంచిన సామ్.. కొత్త ప్రయోగాలు చేస్తోంది.

ఆ సిరీస్‌తో నేషనల్ రేంజ్ క్రేజ్
చాలా కాలంగా సినిమాల్లో సత్తా చాటుతోన్న సమంత.. ఎక్కువగా తెలుగులో మాత్రమే సినిమాలు చేసింది. ఆ తర్వాత తమిళంలోనూ కొన్ని చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా మొత్తం పరిచయమైంది. ఇందులో ఆమె చేసిన టెర్రరిస్టు పాత్రకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఆమె క్రేజ్ నేషనల్ రేంజ్‌కు పెరిగింది.

భారీ ప్రాజెక్టులు.. అవి కంప్లీట్‌గా
సమంత ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీలో నటించింది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ షూట్ కూడా దాదాపుగా పూర్తైపోయింది.

ఆ రెండు భారీ మూవీలు కూడా
నటిగా ఇప్పుడు మరింత పరిణితిని కనబరుస్తోన్న సమంత.. త్వరలోనే ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌లోనే నటించనుంది. BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ తెరకెక్కించే ఈ వెబ్ ఫిల్మ్ 'The arrangements of love' నవల ఆధారంగా రూపొందనుంది. అలాగే, 'యశోద' అనే పాన్ ఇండియా మూవీలోనూ ప్రధాన పాత్ర చేస్తోంది. ఈ షూట్ ఇప్పటికే ప్రారంభం అయింది.

బాలీవుడ్‌లో పాగా వేసేందుకు
'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో తనకు బాలీవుడ్‌లో వచ్చిన క్రేజ్‌ను సమంత క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆమె మరో సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఇందులో వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్నాడు. దీనితో పాటు హిందీలో మరిన్ని ప్రాజెక్టులు చేయాలని ఈ స్టార్ హీరోయిన్ భావిస్తున్నట్లు తెలిసింది.

ముంబైకు షిప్ట్ అవుతుందని
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఆఫర్ల కోసం సమంత ఎక్కువగా ముంబైలోనే మకాం ఉంటోంది. ఈ క్రమంలోనే అక్కడ ఆమె దాదాపు మూడు కోట్ల రూపాలయలతో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇప్పటికే అక్కడికి షిప్ట్ అయిందని కూడా వార్తలు వస్తున్నాయి. తద్వారా విడాకుల తర్వాత ఆమె హైదరాబాద్‌ను వదిలేసిందని అంటున్నారు.

ఓ ఇంటిది కాబోతున్న సామ్
సమంత ముంబైలో ఇల్లు కొనుగోలు చేసిందని వస్తున్న వార్తలపై తాజాగా ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఆమె నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసిందట. అది త్వరలోనే పూర్తి కాబోతుందని తెలుస్తోంది. ఆ ఇల్లు పూర్తైన తర్వాతనే గృహ ప్రవేశం చేస్తుందట. అప్పటి వరకూ ఓ హోటల్‌లో ఉంటుందని తెలిసింది. దీంతో ఈ బ్యూటీ అక్కడా హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











