అది పక్కా జరుగుతుంది.. వెయిట్ చేస్తున్నా, ఎట్టకేలకు సైలెన్స్‌ని బ్రేక్ చేసిన సమంత
అక్కినేని నాగచైతన్య ఇటీవల శోభిత ధూళిపాళ్లతో ప్రేమాయణం నిజమేనని ఊహాగానాలను నిజం చేస్తూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అతి త్వరలో చైతూ- శోభితలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి బంధం శాశ్వతం కాదంటూ వేణుస్వామి వంటి జ్యోతిష్యులు నానా మాటలు అన్నప్పటికీ.. వాటిని పట్టించుకోవద్దని అభిమానులు సూచించారు.
నాగచైతన్య ఓ తోడును వెతుక్కుని తన దారి తాను చూసుకుంటే.. అతని మాజీ సతీమణి సమంత పరిస్థితి ఏంటీ..? ఆమె కూడా రెండో పెళ్లి చేసుకుంటుందా..? సడన్‌గా బాంబు పేలుస్తుందా ..? అంటూ నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. అయితే సమంత ఇప్పటికే ప్రేమలో ఉందని.. ది ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ తీసిన రాజ్ నిడిమోరిని త్వరలో పెళ్లాడనుందని కొద్దిరోజులుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. సమంతతో ప్రేమలో ఉన్నందున రాజ్ కూడా తన భార్యకు డివోర్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.

ఇటీవల సమంత బర్త్ డేను ఆయన గ్రాండ్‌గా నిర్వహించారట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే రాజ్ నిడుమోరు తెలుగువారేనట. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఆయన స్వస్థలమట. దీంతో సమంత మరోసారి తెలుగింటి కోడలు అవుతారని.. త్వరలోనే వీరిద్దరూ తమ బంధంపై అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. సమంత కానీ, రాజ్ కానీ వీటిపై రియాక్ట్ కాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఇలాంటి పరిణామాల మధ్య మంగళవారం సమంత పెట్టిన ఓ పోస్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సంథింగ్ స్పెషల్ రాబోతోంది.. స్టే ట్యూన్డ్ అంటూ పోస్ట్ పెట్టడంతో పాటు వాడిపోయిన ఆకులున్న కొమ్మను ఫోటోను జత చేసింది. దీంతో సమంత ఏం చెప్పబోతోంది.. బహుశా ఎంగేజ్‌మెంట్ , కొత్త బాయ్ ఫ్రెండ్ వివరాలు షేర్ చేస్తుందా అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు చక్కర్లుకొట్టాయి. కట్ చేస్తే సాయంత్రానికి ముంబైలో జరిగిన వరల్డ్ పికిల్ బాల్ లీగ్ ప్రెస్‌మీట్‌లో తళుక్కున మెరిశారు. ఈ మెగాటోర్నీలో భాగంగా ఇటీవల చెన్నై ఫ్రాంఛైజీని కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపింది.

ఇదిలాఉండగా కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిని ఉరి తీయాలని మహిళా సంఘలు, వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళనలు చేస్తున్నారు. ఈ దారుణంపై పలువురు ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. తాజా ప్రెస్‌మీట్‌లో సమంతను ఈ ఘటనపై ప్రశ్నించగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని , ఈ మార్పు త్వరలోనే వస్తుందని ఆకాంక్షిస్తున్నానని సామ్ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











