ఆ సమయంలో బాయ్‌ఫ్రెండ్ ఎవరూ నిలబడలేదు .. నా కోసం నేనే.. సమంత ఎమోషనల్

అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత తన బతుకు తాను బతుకుతున్నారు. వరుసపెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. మయోసైటిస్ బారినపడిన తర్వాత తిరిగి కోలుకుని నిలబడ్డారు. ఆమె నటించిన సిటాడెల్ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. శోభితతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ తర్వాత సమంత సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా సామ్ గతంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే :

హీరోయిన్ల కెరీర్ మూణ్నాళ్ల ముచ్చట అనుకునే సమయంలో దాదాపు 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు సమంత. అది కూడా మోస్ట్ వాంటెడ్ స్టార్‌గా. సినిమాలతోనే కాక.. పర్సనల్ లైఫ్‌తోనూ ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది . ఒకప్పుడు ఆర్ధిక సమస్యల కారణంగా ఇంటి పోషణ నిమిత్తం చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన సమంత.. కానీ ఇప్పుడు ఆమె సంపన్నురాలు. ఇదంతా రాత్రికి రాత్రి వచ్చింది కాదు.. దీని వెనుక ఎంతో కష్టం ఉంది. తనపై ఎన్ని కామెంట్స్ వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు సమంత.

actress samantha ruth prabhu sensational comments on when she faced struggles in life

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన ఏమాయ చేశావేతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు సమంత . ఈ సినిమాలో జెస్సీగా ఆమె నటన కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కాగా.. ఆ వెంటనే ఎన్టీఆర్, మహేశ్ బాబు , పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాలు చేసి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా అవతరించింది. తెలుగులో వచ్చిన స్టార్‌డమ్‌తో కోలీవుడ్‌లోనూ ఛాన్స్‌లు పట్టేసింది. అజిత్, విజయ్, సూర్య , విశాల్, కార్తీ వంటి హీరోలతో నటించింది. ఒకే సమయంలో తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు సమంత.

ఏమాయ చేశావే షూటింగ్ సమయంలో నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత 2017లో పెద్దల అంగీకారంతో ఆయనను పెళ్లాడింది. కానీ నాలుగేళ్లు తిరిగేసరికి వ్యక్తిగత కారణాలతో సమంత - చైతన్య విడిపోతున్నట్లు ప్రకటించడంతో చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తున్న సమయంలో మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడిన సమంత చికిత్స తీసుకుని తిరిగి కోలుకున్నారు.

తన మాజీ భర్త నాగచైతన్య ఒక తోడు వెతుక్కోవడంతో ఆమె కూడా రెండో పెళ్లి చేసుకుంటుందా అన్న డౌట్స్ వచ్చాయి . తెలుగులో ఖుషి తర్వాత మరో సినిమాలో ఆమె కనిపించలేదు. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో సిటాడెల్ హనీ బన్నీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలాఉండగా.. గతంలో సమంత ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు తల్లిదండ్రులు, బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ అండగా నిలవరని అన్నారు. కానీ మన కష్టం ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటుందని.. కష్టపడినవారు ఫెయిల్ కారని సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: samantha ruth prabhu movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X