Samantha ముసుగులో గుద్దులాటలొద్దు.. స్పెషల్ డే రోజు సమంత షాకింగ్ పోస్ట్

సినీనటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంత తన వ్యక్తిగత కారణాలవల్ల అనారోగ్య సమస్యల కారణంగా ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించారు. సమంత ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమె అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొంటున్నారు.

ఈ విధంగా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి సమంతా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడటమే కాకుండా మరోవైపు తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోవడం ఈమెను ఎంతగానో కృంగదీసింది. ఇలా తనకి ఎదురైన ఈ సవాళ్లను ఎదుర్కొంటూ సమంత ముందడుగు వేస్తున్నారు.

actress-samantha-ruth-prabhu

ఇక ప్రస్తుతం సమంత తన సమస్యల నుంచి పూర్తిగా కోలుకోవడానికి సినిమా ఇండస్ట్రీకి కొంత విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఈమె తన చికిత్సలో భాగంగా విదేశాలకు వెళ్తూ చికిత్స తీసుకుంటూ ఈ వ్యాధి నుంచి కోలుకున్నారని కూడా తెలుస్తుంది. ఇక త్వరలోనే సమంత తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు.

ఇలా సినిమా ఇండస్ట్రీకి సమంత దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇకపోతే నేడు నో ఫిల్టర్ డే కావడంతో ఈమె తన ఫోటోకి ఏ విధమైనటువంటి ఫిల్టర్స్ ఉపయోగించకుండా నేచురల్ లుక్ లో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఈమె చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. అనంతరం ఈమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈమె రీ ఎంట్రీ ఇస్తూనే అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు కమిట్ అవుతున్నారని సమాచారం మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X