ఒకప్పుడు బెడ్‌పై నడవలేని స్థితిలో.. నేడేమో ఇలా, సమంతలో ఎంత మార్పు
అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత తనదైన కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటూ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు సమంత. వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఒడిదొడుకులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు సామ్. సినిమాలు, వెబ్ సిరీస్‌ల ద్వారా పనిచేస్తూ.. అందులోనే సేదతీరుతున్నారు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడినా ఎక్కడా ధైర్యాన్ని కోల్పోకుండా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
తన మాజీ భర్త నాగచైతన్య ఓ కొత్త తోడును వెతుక్కుని తన దారి తాను చూసుకుంటే.. సమంత పరిస్థితి ఏంటీ..? ఆమె కూడా రెండో పెళ్లి చేసుకుంటుందా..? సడన్‌గా బాంబు పేలుస్తుందా ..? అంటూ నెటిజన్లు గత కొద్దిరోజులుగా చర్చించుకుంటున్నారు. అయితే సమంత ఇప్పటికే ప్రేమలో ఉందని.. ది ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ తెరకెక్కించిన దర్శకుడు రాజ్ నిడిమోరిని త్వరలో పెళ్లాడనుందని ప్రచారం జరుగుతోంది. కానీ అటు సామ్ కానీ , ఇటు రాజ్ కానీ ఎక్కడా ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు.

సమంతతో ప్రేమలో ఉన్నందున రాజ్ కూడా తన భార్యకు డివోర్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఇటీవల సమంత బర్త్ డేను ఆయన గ్రాండ్‌గా నిర్వహించారట. ఇలాంటి పరిణామాల మధ్య కొద్దిరోజుల క్రితం సమంత పెట్టిన ఓ పోస్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సంథింగ్ స్పెషల్ రాబోతోంది.. స్టే ట్యూన్డ్ అంటూ పోస్ట్ పెట్టడంతో పాటు వాడిపోయిన ఆకులున్న కొమ్మను ఫోటోను జత చేసింది. దీంతో సమంత ఏం చెప్పబోతోంది.. ఎంగేజ్‌మెంట్ , కొత్త బాయ్ ఫ్రెండ్, పెళ్లి వివరాలు షేర్ చెబుతుందా లేక నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ గురించి ఏమైనా మాట్లాడుతుందా అని పలు కథనాలు వచ్చాయి.
ఆ రోజు సాయంత్రానికి ముంబైలో జరిగిన వరల్డ్ పికిల్ బాల్ లీగ్ ప్రెస్‌మీట్‌లో సమంత మాట్లాడుతూ.. ఎన్నో కీలక విషయాలు ప్రస్తావించారు. ఈ మెగాటోర్నీలో భాగంగా ఇటీవల చెన్నై ఫ్రాంఛైజీని కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనపైనా సమంత స్పందించారు. మహిళలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని , ఈ మార్పు త్వరలోనే వస్తుందని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
సమంత పికిల్ బాల్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన నాటి నుంచి అసలు పికెల్ బాల్ అంటే ఏమిది, అది ఎలా ఆడతారు, ఇండియాలో దాని పరిస్ధితి ఏంటీ అనేదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సమంత స్వయంగా తన స్నేహితులతో కలిసి పికిల్ బాల్ ఆడింది. ఆట ముగిసిన తర్వాత డ్యాన్స్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు బెడ్‌పై నడవలేని స్థితిలో నుంచి స్టేడియంలో పికిల్ బాల్ ఆడే స్థాయికి సమంత చేరుకున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సామ్ లుక్, ఫిట్ పూర్తిగా మారిపోయిందని వారు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











