Samantha 10th Mark Sheet: సమంత 10th మార్కుల షీట్ ట్రెండింగ్.. ఎన్ని మార్కులు వచ్చాయో మీరే చూడండి!
సమంత రూత్ ప్రభు.. సింపుల్‌గా సమంత. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. వెండితెరపై హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువనే మాట తప్పని నిరూపించిన అతికొద్దిమంది నటీమణుల్లో సామ్ ఒకరు. దాదాపు 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు సమంత. అది కూడా మోస్ట్ వాంటెడ్ స్టార్‌గా. సినిమాలతోనే కాక.. పర్సనల్ లైఫ్‌తోనూ ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది . తనపై ఎన్ని కామెంట్స్ వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు సమంత.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి నటించిన ఏమాయ చేశావేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు సమంత . అందులో జెస్సీగా ఆమె నటన కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కాగా.. ఆ వెంటనే ఎన్టీఆర్, మహేశ్ బాబు , పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా అవతరించింది. తెలుగులో వచ్చిన స్టార్‌డమ్‌తో కోలీవుడ్‌లోనూ ఛాన్స్‌లు పట్టేసింది. అజిత్, విజయ్, సూర్య విశాల్, కార్తీ వంటి హీరోలతో నటించింది. ఒకే సమయంలో తెలుగు, తమిళ ఇండస్ట్రీలను దున్నేసింది సమంత.

ఏమాయ చేశావే సమయంలో నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత 2017లో పెద్దల అంగీకారంతో ఆయనను పెళ్లాడింది. అయితే నాలుగేళ్లు తిరిగేసరికి వ్యక్తిగత కారణాలతో సమంత - నాగచైతన్య విడిపోతున్నట్లు ప్రకటించడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఈ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడిన సమంత చికిత్స తీసుకుని తిరిగి కోలుకుంది. తెలుగులో ఖుషి తర్వాత మరో సినిమాలో ఆమె కనిపించలేదు. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో సిటాడెల్ హనీ బన్నీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల అక్కినేని నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్ధం నేపథ్యంలో సమంత పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. చైతూ ఒక తోడు వెతుక్కోవడంతో ఆమె కూడా రెండో పెళ్లి చేసుకుంటుందా అన్న డౌట్స్ వచ్చాయి . దీనికి తగినట్లుగానే ది ఫ్యామిలీ మెన్ సిరీస్ తెరకెక్కించిన రాజ్ నిడుమోరుతో సమంత ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ రూమర్స్‌పై ఇద్దరు స్పందించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ముంబైలో జరిగిన వరల్డ్ పికిల్ బాల్ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సమంత అనంతరం కొందరు ఛాంపియన్స్‌తో కలిసి పికిల్ బాల్ ఆడారు.
ఒకప్పుడు ఆర్ధిక సమస్యల కారణంగా ఇంటి పోషణ నిమిత్తం చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన సమంత.. ఇప్పుడు సంపన్నురాలు. ఇదంతా రాత్రికి రాత్రి వచ్చింది కాదు.. దీని వెనుక ఎంతో కష్టం ఉంది. నటనలోనే కాదు, చదవులోనూ సమంత టాపర్. తాజాగా పదో తరగతి నాటి సమంత ప్రోగ్రెస్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె 1000కి 887 మార్కులు సాధించింది. ముఖ్యంగా మ్యాథ్స్‌లో నూటికి నూరు మార్కులు తెచ్చుకుని శెభాష్ అనిపించుకుంది . అంతా బాగానే ఉంది కానీ సామ్ ప్రోగ్రెస్ కార్డ్‌ని జాగ్రత్తగా గమనిస్తే.. ఓ విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేంటంటే ఫిజిక్స్, బోటనీలలో ఆమెకు 50కి 95, 84 మార్కులు వచ్చాయి. ఇదేలా సాధ్యం.. దీని వెనుక ఏదైనా మతలబు ఉందా అంటూ నెటిజన్లు డౌట్స్ రైజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











