పులుల కోసం సమంత వేట.. దట్టమైన అడవిలో రిస్కీ వెకేషన్.. వీడియో ట్రెండింగ్
సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. అలాంటిది దాదాపు 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు సమంత రూత్ ప్రభు. అది కూడా మోస్ట్ వాంటెడ్ స్టార్‌గా. సౌత్‌లోనే గాక.. ఇండియాలోనే మోస్ట్ లీడింగ్ యాక్టర్స్‌లో ఒకరిగా సమంత నిలిచారు. ఇటీవల ఓ పాపులర్ సంస్థ నిర్వహించిన సర్వేలో భారత్‌లో లీడింగ్ ఫిమేల్ స్టార్స్‌లో సమంత నెంబర్‌వన్‌గా నిలిచి తన స్థాయేంటో చూపించారు. తాజాగా సామ్ ఓ ప్లేస్‌కి వెకేషన్‌కి వెళ్లారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఒకప్పుడు కుటుంబంలో ఆర్ధిక సమస్యల కారణంగా ఇంటి పోషణ నిమిత్తం చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన సమంత కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఇదంతా రాత్రికి రాత్రి వచ్చింది కాదు.. దీని వెనుక ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఉన్నాయి. తనపై ఎన్ని కామెంట్స్ వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు సమంత. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన ఏమాయ చేశావేతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు సామ్ . ఈ సినిమాలో జెస్సీగా ఆమె నటన , క్యూట్ లుక్స్ కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది.

ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో వెంటనే ఎన్టీఆర్, మహేశ్ బాబు , పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా అవతరించింది. తెలుగులో వచ్చిన స్టార్‌డమ్‌తో కోలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్ట్‌ల్ని అందుకుంది సామ్. అజిత్, విజయ్, సూర్య , విశాల్, కార్తీ వంటి హీరోలతో నటించింది.
ఏమాయ చేశావే సినిమా షూటింగ్ సమయంలో నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత ఆయనతో సుదీర్ఘకాలం డేటింగ్ చేశారు. ఆ తర్వాత తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి 2017లో పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. కానీ నాలుగేళ్లు తిరిగేసరికి వ్యక్తిగత కారణాలతో సమంత - చైతన్య విడిపోతున్నట్లు ప్రకటించడంతో చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారు. దీంతో మానసికంగా కృంగిపోయిన సమంతను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి మరింత బాధించింది. దీనికి చికిత్స తీసుకుని కోలుకున్న ఆమె తిరిగి సినిమాలలో బిజీ అయ్యారు.
ఇటీవల అక్కినేని నాగచైతన్య - శోభితల నిశ్చితార్ధం జరగడంతో సమంత పేరు మరోసారి వార్తల్లోకెక్కింది. చైతూ కొత్త తోడు వెతుక్కోవడంతో సామ్ కూడా మరొకరిని పెళ్లాడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఖుషి తర్వాత తెలుగులో మరో ప్రాజెక్ట్‌కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి ఆమె నటించిన సిటాడెల్ హనీ బన్నీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తన కొత్త సినిమా సంగతులు, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే వీలు కుదిరినప్పుడల్లా ఏదో ఒక విహారయాత్రకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌లోని ప్రఖ్యాత రణథంబోర్ నేషనల్ పార్క్‌లో సమంత చక్కర్లు కొడుతున్నారు. గత నాలుగు రోజులుగా ఆమె అక్కడే ఉన్నారు.. చివరికి దీపావళిని కూడా రణథంబోర్ కోటలోనే జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె పంచుకున్నారు. అందులో పులి, మొసలితో పాటు అరుదైన పక్షులను చూడొచ్చు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పులిని చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











