16 ఏళ్ళ వయసులో సమంత గ్లామర్ లుక్ చూసారా.. అప్పట్లోనే పొట్టి స్కర్టులో స్టన్నింగ్!
సౌత్ సినిమా ప్రపంచంలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున అందుకున్న సమంత బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. దాదాపు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు అందరితోనూ ఆమె సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇక ఆమె సోషల్ మీడియాలో ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేసుకుంది. ఇప్పుడు ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 16 ఏళ్ల వయసులో సమంత గ్లామర్ లుక్కుతోనే ఆశ్చర్యాన్ని కలిగించేలా దర్శనమిచ్చింది. ఇక ఆ ఫొటో వివరాల్లోకి వెళితే..

జెస్సీగానే ఊహించని క్రేజ్: ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన పేరు కంటే కూడా జెస్సీగానే ఎక్కుమ మంది కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది. అందరూ అలాంటి అమ్మాయే తన గర్ల్ ఫ్రెండ్ కావాలని కోరుకునేంత అందం ఉన్న ఆమె.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ఎన్నో హిట్ సినిమాలు: ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం, అ ఆ, మహానటి, ఓ బేబీ, జాను, యశోద, శాకుంతలం వంటి చిత్రాల్లోనూ నటించి విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది. 35 ఏళ్ల వయసు కలిగిన ఈమె స్కూల్లో చదివే అమ్మాయి నుంచి వృద్ధురాలి వరకు అన్ని పాత్రలు పోషించింది. తన అందం, అభినయంతో ఇప్పటికీ వరసు సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ దుసుకెళ్తుంది.

16 ఏళ్ళ వయసులో సమంత లుక్: అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైప్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈమె ఇన్ స్టా వేధికగా తాన 16 ఏళ్ల వయసున్నప్పుడు తీసుకున్న ఫొటోను షేర్ చేసింది. అందులో సామ్ చాలా అందంగా కనిపిస్తోంది.
గ్లామరస్ లుక్ వైరల్: బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ పొటోలో సామ్ చిన్న ఫ్రాక్ విత్ ష్రగ్ వేసుకుంది. సోఫాపై కూర్చున్న ఈమె ఓ చేయిని తలకు పెట్టుకుని అదిరిపోయే స్టిల్ ఇచ్చింది. ఈ ఫొటోను చూసిన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. 18 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తున్నావని చెబుతున్నారు. వయసుతో పాటు నీ అందం కూడా రెట్టింపవుతోందని అంటున్నారు.

చాలా అందంగా కనిపిస్తున్నావంటూ: పదాహారేళ్ల వయసులో కూడా నీవు మరీ చిన్న పిల్లలా ఏం కనిపించట్లేవని.. చాలా అందంగా కనిపిస్తున్నావంటూ తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. ఏమైనా సామ్ అందానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఇటీవలే ఆమె హీరోయిన్ గా నటించిన శాకుంతలం, యశోద సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. కనీసం ఖుషీ అయినా హిట్టుగా నిలుస్తుందో లేదో చూడాలి మరి. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











