పలకరించేవాడు లేడు .. ఒంటరితనంతో నరకం చూస్తున్నా.. సమంత షాకింగ్ పోస్ట్
భవిష్యత్తులో ప్రపంచాన్ని కుదిపేసేది క్యాన్సర్, గుండెజబ్బులు కాదని.. ఒంటరితనం మానవాళిని ముంచేస్తుందని ఎందరో నిపుణులు, సంస్థలు హెచ్చరిస్తున్నాయి. లక్షలు దాటి కోట్లలో వేతనాలు అందుకుంటున్నా , కూర్చొన్న చోటుకే సకల భోగాలు వచ్చి పడుతున్నా అవేవీ ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఒంటరితనంతో నిరాశ నిస్పృహలు ఆవహించి ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇది రానున్న రోజుల్లో సమాజానికి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ సమంత కూడా ఒంటరితనం గురించి సంచలన పోస్ట్ చేసింది.
ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం సమంత వ్యక్తిగత జీవితంలో పెద్ద కుదుపు తీసుకొచ్చింది. దాని నుంచి బయటపడేందుకు సమంత పెద్ద పోరాటమే చేశారు. స్నేహితులతో విహారయాత్రలతో పాటు ఆధ్యాత్మిక బాటలో పయనించారు. కోయంబత్తూరులోని సద్గురు జగ్గీవాసుదేవ్ ఆశ్రమంలో గడిపారు. ఇప్పటికీ తనకు వీలు కుదిరినప్పుడల్లా ఈషా ఫౌండేషన్‌లో గడుపుతుంటారు సమంత.

నాగచైతన్య మరో తోడు వెతుక్కుని హీరోయిన్ శోభిత ధూళిపాళను రెండో పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. చైతన్య రెండో పెళ్లి బయటకు పొక్కడంతో సామ్ ఎలా స్పందిస్తారోనని అంతా అనుకున్నారు. కానీ ఆమె చాలా లైట్ తీసుకున్నారు. కాకపోతే ఇన్‌డైరెక్ట్‌గా నాగచైతన్యపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సామ్ లవ్‌లో ఉన్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇది ఆ తర్వాత పుకారుగానే మిగిలిపోయింది.
సమంత గత కొద్దినెలలుగా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టి ముంబైకి తన మకాం మార్చేసుకున్నారు. ఓటీటీ మార్కెట్ ప్రభావం రోజురోజుకు పెరుగుతుండటంతో అటు ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. వరుసపెట్టి వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. గతేడాది సిటాడెల్ వెబ్ సిరీస్‌తో సమంత పలకరించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా సిటాడెల్ హనీ బన్నీ అరుదైన రికార్డు సాధించింది. దాదాపు 150 దేశాల్లో టాప్ 10లో సిటాడెల్ స్ట్రీమింగ్ అయి సమంతకు వరల్డ్ క్లాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ వెబ్ సిరీస్‌కు ఇటీవల ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ దక్కింది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఆధ్యాత్మిక సంస్థలో గడిపేందుకు వెళ్లిన సామ్ దీనికి సంబంధించిన ఐడీ కార్డ్‌ను షేర్ చేశారు. అంతేకాదు.. మూడు రోజులు మౌనంగా ఉన్నానని, ఫోన్ లేదు, ఎవరితోనూ కమ్యూనికేషన్ లేదని సమంత చెప్పారు. ఒంటరితనం అన్నింటికంటే భయంకరమైనదని... అక్కడ నాకు నేనుగా బతికానని సమంత తెలిపారు. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించాలని.. మనంతో మనం ఉండటం ఎన్నో విషయాలను నేర్పిస్తుందని అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











