స్లీవ్‌లెస్ డ్రెస్సులో సమంత ఊహించని హాట్ షో.. పై నుంచి అవి చూపిస్తూ ఘాటు పోజు!
ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయి అందరినీ మాయ చేసిన ముద్దగుమ్మ సమంత. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ అందుకున్న ఈ బ్యూటి ఆ తర్వాత అనేక మంది అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీసులతో ఫుల్ బిజీగా ఉంది సమంత. అలాగే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన హాట్ పిక్స్ షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అలాంటి ఓ పిక్ ఒకటి షేర్ చేసి అందరి దృష్టి ఆకర్షించింది.

పెద్ద ఝలక్: ప్రస్తుతం వరుసగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న సమంత ఇటీవల శాకుతంలంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలోని గ్రాఫికల్ విజువల్స్ పై నెగెటివిటీ రాగా దిల్ రాజ్ 25 ఏళ్ల కెరీర్ లో పెద్ద ఝలక్ అని చెప్పి షాక్ ఇచ్చాడు.

అవార్డులు: ఎన్నో ఆశలు పెట్టుకున్న శాకుంతలం సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోగా ఓటీటీలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మే 12న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ సినిమాకు ఆదరణ కరువైంది. అయితే ఈ మూవీకి ఎవరూ ఊహించని విధంగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కేన్స్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ 2023 వేడుకల్లో 4 అవార్డ్స్ సాధించి సత్తా చాటింది.

మంచి అంచనాలు: ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సమంత ఖుషి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ తెలుగు మూవీనే కాకుండా హాలీవుడ్ వెబ్ సిరీసు, సినిమాల్లోనూ అదరగొట్టనుంది ఈ ఫిట్ నెస్ బ్యూటి.

దానికి ప్రీక్వెల్: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో సమంత నటించనుంది. అయితే ప్రియాంక చేసిన సిటాడెల్ కు ప్రీక్వెల్ గా సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ ఉండనుందని ప్రస్తుతం ఉన్న సమాచారం. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీసులో సమంతతోపాటు వరుణ్ ధావన్ కూడా కీలక పాత్ర పోషించనున్నాడు.

బోల్ట్ పిక్ వైరల్: ఇదే కాకుండా చెన్నై స్టోరీ అనే మరో ఇంగ్లీష్ మూవీ కూడా చేస్తుంది ముద్దుగుమ్మ సమంత. ఇందులో ఇంగ్లాండ్ నటుడు వివేక్ కల్రా హీరోగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సామ్ తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని బ్లాక్ సన్ గ్లాసెస్ తో దర్శనం ఇచ్చింది. కింద గార్డెన్ లో పడుకున్న సామ్ అందాలు టాప్ యాంగిల్ లో కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











