For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిటైర్మెంట్ తీసుకుంటానా? లేక ఏమైనా చేస్తానా? తెలియదు: సమంత

|

స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై తెర‌కెక్కిన చిత్రం ఓ బేబీ. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ నిర్మాత‌లు.

జూలై 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samantha

గత కొన్ని రోజులుగా యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా నా మొహమే కనిపిస్తోంది అంటున్నారు. కాస్టూమ్ మాత్రమే మారుతోంది, మాటలు మాత్రం అవే ఉంటున్నాయి అంటుండటంతో నాకే సిగ్గుగా అనిపించింది. కానీ ఏం చేయాలి? 'ఓ బేబీ' సినిమా కోసం తప్పదు కదా... ప్రమోషన్స్ చేయకుంటే మా సినిమా గురించి ఎవరు పట్టించుకుంటారు? సినిమా విడుదలవ్వడంతో మా పని ముగిసింది. ఇప్పుడు సినిమా గురించి చెప్పడానికి కూడా ఏమీ లేదని సమంత తెలిపారు.

సినిమా ఆడియన్స్‌కు రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసిన మీడియా, క్రిటిక్స్‌కు థాంక్స్. మా సినిమాను ఆదరించి గొప్ప బహుమతి అందించిన ఆడియన్స్‌కు థాంక్స్. నెక్ట్స్ ఏం చేయాలి? అనే విషయంలో కాస్త కన్‌ఫ్యూజన్లో ఉన్నాను? రిటైర్మెంట్ తీసుకుంటానా? లేక ఏమైనా చేస్తానా? అనేది తెలియదు. నాకు ఇలాంటివి మామూలే. సినిమా విజయం అందుకుంది కాబట్టి రెండు రోజులు హ్యాపీగా ఉంటాను. మళ్లీ వస్తాను, ఇంకా బెటర్ స్క్రిప్ట్, బెటర్ పెర్ఫార్మెన్స్ చేయాలనే పిచ్చి నాకు ఉంటుంది.

కొన్ని సార్లు షూటింగ్ కష్టంగా ఉంటుంది. రిజల్ట్‌ఎక్స్ ట్రార్డినరీగా ఉంటుంది. కొన్ని సార్లు షూటింగ్ కంఫర్టబుల్‌గా ఉంటుంది. రిజల్ట్ అంత బాగా ఉండదు. కానీ ఈ సినిమా విషయంలో ప్రతీ రోజూ సంతోషంగా ఉన్నాను. రిజల్ట్ కూడా చాలా బెటర్‌గా ఉంది. ఇది నాకు ప్రేక్షకులు అందించిన గ్రేటెస్ట్ గిఫ్ట్. మీరు చేస్తున్న ట్వీట్లు చదువుతున్నాను, మీరు చేసే ప్రతి ట్వీట్ నా హార్ట్‌కు టచ్ అవుతుందని సమంత తెలిపారు.

English summary
Actress Samantha Speech at Oh Baby Movie Success Meet. Oh! Baby is 2019 Telugu fantasy comedy film, based on the South Korean film Miss Granny, produced by D. Suresh Babu, Sunitha Tati, T.G.Vishwa Prasad, Hyunwoo Thomas Kim on Suresh Productions, People's Media Factory Guru Films, Kross Pictures banners and directed by B. V. Nandini Reddy. The film stars Samantha Akkineni, Naga Shaurya, Lakshmi, Rajendra Prasad in the lead roles and music composed by Mickey J. Meyer.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more