For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విడాకుల తరువాత అక్కినేని కాంపౌండ్ లో దర్శనమిచ్చిన సమంత.. వెళ్లక తప్పలేదు!

  |

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య తో ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పదేళ్ల వారి అనుబంధానికి మొత్తానికి వీడ్కోలు చెప్పడంతో అభిమానులు చాలా అప్సెట్ అయ్యారు. మొదట ఆ విషయంపై అనేక రకాల కథనాలు వెలువడినప్పుడు అవన్నీ కూడా అబద్ధాలు అనుకున్నారు. కానీ ఇద్దరు కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడంతో నమ్మక తప్పలేదు. ఇక సోషల్ మీడియాలో చాలా చురుగ్గా పాల్గొంటున్న సమంత మరోవైపు సినిమాలతో కూడా చాలా బిజీగా ఉంది. ఇక విడాకుల అనంతరం ఆమె మొదటి సారి అక్కినేనివారి కాంపౌండ్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

  బెస్ట్ స్టార్ కపుల్స్ గా..

  బెస్ట్ స్టార్ కపుల్స్ గా..


  సమంత నాగచైతన్య ఇద్దరు కూడా మొదట ఏ మాయ చేశావే సినిమాతో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే వారి మధ్యలో ఒక మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. తర్వాత వారి బంధం ప్రేమ వరకు వెళ్ళింది. ఇద్దరూ కూడా బెస్ట్ స్టార్ కపుల్స్ గా సౌత్ ఇండస్ట్రీ లో ఒక మంచి క్రేజ్ అయితే అందుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి సినిమాలు చేయడంతో అక్కడ కూడా ఈ జంటకు మంచి క్రేజ్ తగ్గింది.

  అబద్ధం అనుకున్నారు..

  అబద్ధం అనుకున్నారు..


  ఈ బ్యూటిఫుల్ కపుల్స్ ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా కలిసి ఉండాలి అని చాలామంది అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా కోరుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇటీవల వారి దాంపత్య జీవితానికి ముగింపు కార్డ్ వేయడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అబద్ధం అనుకున్న వార్త నిజమవుతుందని చాలామంది అభిమానులు ఊహించలేదు.

  విడాకుల తరువాత`

  విడాకుల తరువాత`


  ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ టాపిక్ గా మారుతోంది. మొదటిసారి సమంత అక్కినేని వారికి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో దర్శనం ఇవ్వడంతో ఆ వార్త ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. విడాకుల అనంతరం సమంత నాగచైతన్య ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. నాగచైతన్య కూడాఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసి ప్రత్యేకంగా ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నాడు.

  ఆ సినిమా కోసం తప్పలేదు

  ఆ సినిమా కోసం తప్పలేదు

  ఇక చాలా కాలం తర్వాత సమంత అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియో లో ఎందుకు కనిపించింది అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె కేవలం ఒక సినిమా డబ్బింగ్ కోసం మాత్రమే ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శాకుంతలం అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా డబ్బింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోకు రాక తప్పలేదని తెలుస్తోంది.

  చైతూ పుట్టినరోజు సమంత సైలెన్స్

  చైతూ పుట్టినరోజు సమంత సైలెన్స్

  ఇటీవల నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా సమంత నుంచి ఏదైనా మెసేజ్ వస్తుందేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ సమంత మాత్రం ఇలాంటి పోస్ట్ చేయలేదు. ఆ విషయం సోషల్ మీడియాలో అయితే బాగానే వైరల్ అయితే అయింది. ఇటీవల సమంత తన పెట్ డాగ్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వాటి పుట్టిన రోజు వేడుకలను కూడా సెలబ్రేట్ చేసినట్లు తెలియజేసింది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫోటోలో పై అనేక రకాలుగా ట్రోల్స్ సైతం వచ్చాయి.

  Akhanda Movie టార్గెట్.. | Naga Chaitanya మాస్ లో క్లాస్ ! || Filmibeat Telugu
   పుష్ప కోసం భారీ రెమ్యునరేషన్

  పుష్ప కోసం భారీ రెమ్యునరేషన్


  ఇంకా సమంత పెళ్లి తర్వాత అన్నిరకాల కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే విడాకుల అనంతరం ఆమె ఆలోచన విధానం మరింత కొత్తగా ఉందని అనిపిస్తుంది. ఇప్పటివరకు స్పెషల్ ఐటమ్ సాంగ్స్ చేయని సమంత పుష్ప సినిమాల్లో ఐటమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు క్లారిటీ వచ్చేసింది. అందుకోసం ఆమె రెండు కోట్ల వరకు కూడా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

  English summary
  Actress Samantha Spotted In akkineni family Annapurna Studios
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X