యావదాస్తిని అనాథల పేరిట.. సమంత హింట్స్ ఇస్తున్నారా, వామ్మో ఇంత వెనకేసిందా..?
గత కొద్దినెలలుగా వస్తున్న రూమర్స్‌కి చెక్ పెడుతూ అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చారు. ముందు నుంచే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని మీడియా కోడై కూసింది. చాలా మంది వీటిని గాసిప్స్‌గా కొట్టిపారేయగా.. నిప్పు లేనిదే పొగ రాదు కదా అని మరికొందరు వాదించారు. చివరికి ఈ పుకార్లే నిజమై ఈ జంట పెద్దల అంగీకారంతో త్వరలో ఒక్కటి కాబోతోంది. చైతన్య మరో పెళ్లికి సిద్ధమైన నేపథ్యంలో అతని మాజీ భార్య, అగ్ర నటి సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. చైతూ చూపిన బాటలో ఆమె కూడా మరో తోడుని వెతుక్కుంటారా , లేక సోలో లైఫే సో బెటర్ అనుకుంటూ ఇలానే కంటిన్యూ చేస్తారా అనే డిస్కషన్ నడుస్తోంది.
ప్రజంట్ సమంత కెరీర్ ఏమీ గొప్పగా సాగడం లేదు. చైతన్యతో విడాకులు తీసుకున్న కొత్తలో వరుసపెట్టి అవకాశాలు అందుకోవడంతో పాటు ఓటీటీలో చేసిన ది ఫ్యామిలీ : సీజన్ -2 ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. వ్యక్తిగత జీవితంలో తలెత్తిన ఇబ్బందులను మరిచిపోవడానికి ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్పులకు వెళ్లడంతో పాటు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో ఆధ్యాత్మిక సేవలో తరిస్తూ సేదతీరింది. మధ్యలో మయోసైటిస్ అనే వ్యాధి బారినపడిన సామ్.. దానికి చికిత్స తీసుకుని నెమ్మదిగా కోలుకున్నారు.

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తను చేసిన శాకుంతలంపై సమంత ఎన్నో ఆశలు పెట్టుకోగా అది కాస్తా డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ ఏమాత్రం అధైర్యపడకుండా ప్రేమ కథల స్పెషలిస్ట్ శివ నిర్వాణ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి కూడా సమంతకు షాకిచ్చింది. ప్రస్తుతం హిందీలో రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న సిటాడెల్ : హనీ బన్నీ సిరీస్‌లో సామ్ నటిస్తున్నారు. ఇదొక్కటి తప్పించి ఆమె చేతిలో మరే ప్రాజెక్ట్ లేదు.
పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫైషనల్ లైఫ్‌లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ సమంతకు నాగచైతన్య షాకిచ్చారు. దీంతో ఆమె ఏం చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది. కెరీర్ బిగెనింగ్ నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో సామ్ ముందుంటున్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆలనా పాలనా చూస్తున్న పలు సంస్థలకు భారీగా విరాళాలిచ్చారు.. ఈ క్రమంలో సేవా కార్యక్రమాల ద్వారానే మానసిక ప్రశాంతత పొందాలని సమంత భావిస్తున్నారట. దీనిలో భాగంగా తన ఆస్తిలో దాదాపు 60 శాతం వాటాను కొన్ని అనాథ ఆశ్రమాలకు రాసివ్వాలని యోచిస్తున్నారట.. ఇందుకోసం ఆమె న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లుగా ఓ వార్త వైరల్ అవుతోంది.

ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. సమంత ఆస్తులు ఎంత అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆమె పేరిట రూ.120 కోట్లకు పైగా ఆస్తులున్నాయని అంచనా. సినిమాకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే సమంత.. ప్రముఖ బ్రాండ్స్‌కి ఎండార్స్‌మెంట్ చేస్తూ అక్కడా బాగానే సంపాదిస్తున్నారు. వచ్చిన మొత్తాన్ని పలు వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి .. కోట్ల రూపాయల ఆస్తుల్ని వెనకేసినట్లుగా ఫిలింనగర్ టాక్.


Click it and Unblock the Notifications











