అలాంటి టార్చర్ అనుభవించా, ఆఫర్ ఇచ్చి కమిట్‌మెంట్ అడిగారు.. రకరకాలుగా హింసించారు.. సమీరారెడ్డి

సినిమా పరిశ్రమలో మహిళలపై వేధింపులు ఉన్నాయని హీరోయిన్ సమీరారెడ్డి బాంబు పేల్చింది. గత కొద్దికాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఈ తార ప్రస్తుతం కుటుంబానికి పరిమితమైంది. తాజాగా ప్రెగ్నెంట్ కావడంతో విపరీతంగా లావు కావడంపై నెటిజన్లు ట్రోల్ చేయడంతో మళ్లీ వార్తల్లో కనిపించారు. తనపై ట్రోలింగ్, సినిమా పరిశ్రమలో రావాల్సిన మార్పుల గురించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవే..

 ప్రస్తుతం మరోసారి ప్రెగ్నెంట్‌గా

ప్రస్తుతం మరోసారి ప్రెగ్నెంట్‌గా

2014 వరకు సమీరారెడ్డి దక్షిణాది సినిమా పరిశ్రమలో రాణించింది. ఆ తర్వాత పారిశ్రామిక వేత్త అక్షయ్ వార్దేను వివాహం చేసుకోవడంతో యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పారు. 2015 నుంచి కేవలం ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యారు. తాజాగా రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీ అయ్యారు.

సుఖం పొందాలని చూశారని

సుఖం పొందాలని చూశారని

తాజాగా తమిళ మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా సినీ పరిశ్రమలో చాలా మార్పులు రావాల్సి ఉంది. ఆఫర్లు ఇచ్చి మహిళల నుంచి శారీరకంగా సుఖం పొందాలనే పద్దతి మారాలి. మహిళలను వాడకపు వస్తువుగా చూడటం సరికాదు. పరిశ్రమ బాగుపడాలంటే ఇలాంటి వాటిలో మార్పులు రావాలి అని సమీరారెడ్డి అన్నారు.

వేధింపులకు గురయ్యా

వేధింపులకు గురయ్యా

నాకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలోనూ, నటిగా ఓ రేంజ్‌కు చేరుకొన్న తర్వాత కూడా రకరకాల వేధింపులకు గురయ్యాను. పలు రకాల పద్దతుల్లో నాతో అసభ్యంగా ప్రవర్తించారు. కమిట్‌మెంట్ కోసం అడిగిన సంఘటనలు ఉన్నాయి అని సమీరా రెడ్డి వెల్లడించారు.

మీ టూ ఉద్యమంతో మార్పు

మీ టూ ఉద్యమంతో మార్పు

మహిళలపై వేధింపుల లేకుండా ఉండాలనే మార్పు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. సినీ పరిశ్రమలో మహిళలకు, పురుషలకు సమానత్వం లేదు. ఏదో ఒకరోజు మార్పు వస్తే పరిశ్రమకు మంచి జరుగుతుంది. మీటూ ఉద్యమాల వల్ల ఇప్పడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. అటువైపు బుల్లి బుల్లి అడుగులు పడుతున్నాయి అని సమీరా రెడ్డి అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X