పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ.. ఆ స్టార్లకు చెప్పినా హెల్ప్ చేయలేదు: సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమలో అందంతో పాటు యాక్టింగ్ అదరగొట్టే సామర్ధ్యం ఉన్నా.. కొంత మంది అమ్మాయిలు మాత్రం ఫ్లాప్ హీరోయిన్లుగా చెడ్డ పేరును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో సమీరా రెడ్డి ఒకరు. టాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడు కెరీర్ సవ్యంగా సాగకపోవడంతో యాక్టింగ్ కెరీర్‌కు గ్యాప్ ఇచ్చేసింది.

ఇక, ఇప్పుడు పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోన్న సమీరా రెడ్డి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన పెళ్లి తర్వాత ఎదురైన కష్టాల గురించి సవివరంగా వెల్లడించింది. అసలేం జరిగిందో మీరే చూసేయండి మరి!

Actress Sameera Reddy Reveals about Trolls After Marriage

తెలుగు పిల్ల.. అక్కడ ఎంట్రీ: తెలుగు నేపథ్యం ఉన్న కుటుంబంలోనే సమీరా రెడ్డి జన్మించింది. చదువుకుంటోన్న సమయంలోనే ఈ అమ్మడు మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. ఆ తర్వాత 'మైనే దిల్ తుజ్‌కో దియా' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది. తద్వారా దేశ వ్యాప్తంగా ఫేమస్ అవడంతో పాటు ఆమెకు చాలా ఆఫర్లు లభించాయి.

Actress Sameera Reddy Reveals about Trolls After Marriage

టాలీవుడ్‌లో... డిజాస్టర్లతోనే: సమీరా రెడ్డి.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నరసింహుడు' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ పరాజయం పాలైంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 'జై చిరంజీవ' అనే మూవీ చేసినా నిరాశే ఎదురైంది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో 'అశోక్' చేసినా డిజాస్టర్‌గానే మిగిలిపోయింది.

Actress Sameera Reddy Reveals about Trolls After Marriage

అతడితో పెళ్లి.. పిల్లలతోనే: కెరీర్‌ను ఆశించిన విధంగా సాగించలేకపోయిన సమీరా రెడ్డి 2014లో అక్షయ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఈ మధ్యలో మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగినా.. అది మాత్రం జరగలేదు. పైగా వెంట వెంటనే ఈ సీనియర్ హీరోయిన్ ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి మాతృత్వాన్నే ఎంజాయ్ చేస్తూ ఎక్కువగా ఫ్యామిలీతోనే గడుపుతోంది.

Actress Sameera Reddy Reveals about Trolls After Marriage

పెళ్లి తర్వాత ఎన్నో ట్రోల్స్: పర్సనల్ అండ్ ఉమెన్ బ్యూటీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలతో సమీరా రెడ్డి ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన పెళ్లి తర్వాత ఎదురైన ట్రోల్స్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది. 'పెళ్లి జరిగిన కొత్తలోనే గర్భం దాల్చడంతో నాపై చాలా బాడీ షేమింగ్ ట్రోల్స్ వచ్చాయి' అని సమీరా రెడ్డి వెల్లడించింది.

పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ: ఈ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ.. '2014లో అక్షయ్‌తో నాకు పెళ్లి జరిగింది. దీన్ని మా ఇంటి టెర్రస్ మీదే జరిపారు. ఏ హడావిడి లేకుండా వివాహం చేసుకోవడంతో దీన్ని కూడా చాలా మంది ట్రోల్ చేశారు. అంతేకాదు, నేను పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవడం వల్లే ఇలా కామ్‌గా అక్షయ్‌తో ఏడడుగులు నడిచేశానని విమర్శలు కూడా వచ్చాయి' అని చెప్పుకొచ్చింది.

బాడీ షేమింగ్ చేశారంటూ: సమీరా కంటిన్యూ చేస్తూ.. '2015లో నాకు బాబు పుట్టాడు. ఆ సమయంలో నా శరీరంలో ఎన్నో మార్పులు వచ్చి చాలా లావుగా తయారయ్యాను. దీంతో చాలా మంది నన్ను బాడీ షేమింగ్ చేశారు. ఆఖరికి కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా మీకు ఏమైంది? ఇలా అయిపోయారేంటి అని అడిగాడు. దీంతో చాలా కాలం పాటు నేను ఎవరికీ కనిపించకూడదని నిర్ణయించుకున్నా' అని చెప్పింది.

సాయం చేయనే లేదని: సమీరా కొనసాగిస్తూ.. 'చాలా కాలం సినిమాలు చేయని నేను.. ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవ్వాలని అనుకున్నాను. దీనికి సోషల్ మీడియానే సరైన మార్గం అని భావించాను. అలా ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసి.. దాన్ని ప్రమోట్ చేయమని కొంతమంది సినీ సెలెబ్రిటీలను అడిగాను. కానీ, ఎవరూ నాకు సహాయం చేయలేదు. దీంతో చాలా బాధ పడ్డాను' అంటూ ఎమోషనల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X