Samyuktha Menon శరీరంపై అక్కడ సీక్రెట్ టాటూ.. ఆ హీరో ప్రేమ గుర్తుగా.. ఎట్టకేలకు గుట్టు తెలిసింది!
ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ బ్యూటీ అనే ఇమేజ్ తో దూసుకుపోతున్న మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. ఈ అమ్మడు మాతృభాషలోనే హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంటోంది. అమ్మడి లక్కు ఏమిటో గాని పట్టుకుంటే బాక్సాఫీస్ హిట్ అనేలా ఉంది. అలా కొనసాగుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతీ చిన్న విషయంలో హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ఆ మద్య అమ్మడు చూపించిన టాటూ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక దాని అర్థం ఏమిటా అని ఫ్యాన్స్ అందరూ కూడా డీకోడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మొదట్లోనే బాక్సాఫీస్ : భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన సంయుక్త.. ఆ మూవీలో రానాకి జోడీగా నటించారు. మెయిన్ హీరోయిన్ కాకున్నా మంది ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే కనిపించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో అమ్మడి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. త్రివిక్రమ్ సపోర్టుతోనే అమ్మడు వరుసగా ఆఫర్స్ అందుకుంటున్నట్లు ఒక టాక్ అయితే వస్తోంది.

వరుసగా నాలుగు విజయాలు : ఇక ఆ మూవీ సక్సెస్ తర్వాత కళ్యాణ్ రామ్ కి జోడీగా బింబిసారా మూవీలో సంయుక్త నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. గత ఏడాది ధనుష్ కి జోడీగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సార్ మూవీతో మరో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు. ఇలా హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న సంయుక్త మీనన్ కి తాజాగా విరూపాక్ష మూవీతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వచ్చి చేరింది.

పెరిగిన రెమ్యునరేషన్ : వరుసగా నాలుగు హిట్స్ తో ఇప్పుడు సంయుక్త బ్రాండ్ ఒక్కసారిగా టాలీవుడ్ లో సెన్సేషన్ అయిపొయింది. గోల్డెన్ లెగ్ బ్యూటీగా మారిపోయింది. అలాగే ఆమె రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు టాక్ వస్తోంది. మొన్నటివరకు లక్షల్లో రెమ్యునరేషన్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు కోటికి పైగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్.
ఆమె శరీరంపై స్పెషల్ టాటూ : ఇక సంయుక్త సినిమాలలో ఎలా అయితే స్ట్రాంగ్ విమెన్ పాత్రలు చేస్తుందో బయట కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే రెబల్ క్యారెక్టర్ తో ఏ విషయంలో అయిన ఫుల్ క్లారిటీతో ఉంటారు. మొహమాటం లేకుండా తన అభిప్రాయాలు చెబుతారు. చాలా వేగంగా సంయుక్త తెలుగు భాషపై పట్టు సంపాదించుకోవడం విశేషం. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సంయుక్త భుజం మీద మలయాళీ భాషలో ఒక టాటూ కనిపిస్తోంది.అయితే దీని మీటింగ్ ఏంటో తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపించారు.
హీరో పేరు కాదట : మొదట ఆ టాటూ చూసి ఆమె ఒక యువ హీరోతో లవ్ లో ఉందని అతని పేరు వచ్చేలా ఆమె టాటూ వేసుకుందని కొన్ని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ అది నిజం కాదట. మలయాళంలో సంచారి అనే పేరుతో ఆమె టాటూగా వేసుకున్నారు. సంచారి అంటే సోలో ట్రావెలర్. ఈ టాటూ బట్టి ఆమెకి ఒంటరి ప్రయాణం అంటే చాలా ఇష్టం అని అర్ధం అవుతుంది. తనకి ఫ్రీ టైమ్ దొరికిన లేదంటే మూడ్ సరిగా లేకపోయిన ఒంటరిగా ఎంత దూరం అయినా వెళ్లిపోతుందంట.

సంయుక్త ఒంటరి ప్రయాణం: మలయాళీలో సినిమాలు ఆపేసిన తర్వాత 8 రోజుల పాటు ఆమె ఒంటరిగా ప్రయాణం చేసారంట. ఎక్కువగా ఆధ్యాత్మిక అన్వేషణలో భాగంగా ఆమె ఒంటరి ప్రయాణం ఇష్టపడుతూ ఉంటారు. అదే సమయంలో టాలీవుడ్ నుంచి భీమ్లానాయక్ సినిమాలో అవకాశం వచ్చిందంట. ఇక ఈ మూవీ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏకంగా కొన్ని డైలాగ్స్ ఇచ్చి నవరసాలలో పెర్ఫార్మ్ చేసి చూపించమన్నారంట. ఆమె కూడా ఎలాంటి సంకోచం లేకుండా చేసారంట. ఇక సంయుక్త పెర్ఫార్మెన్స్ కి ఇంప్రెస్ అయిన త్రివిక్రమ్ ఆమెకి భీమ్లానాయక్ మూవీలో అవకాశం ఇచ్చారంట. అలా వచ్చిన అవకాశంతో ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన బెర్త్ ని సంయుక్త ఖాయం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











