ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోను.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఫైర్
కాంట్రవర్సీకి మారుపేరుగా నిలుస్తుంటారు తమిళ నాటి సనమ్ శెట్టి. ఎవరు ఏమనుకున్నా సరే .. ఉన్నది ఉన్నట్లు ముఖంపై కొట్టినట్లు మాట్లాడే ఈ అమ్మడు మీడియా ముందుకు వచ్చినా, సోసల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఎవడికో మూడిందనే అనుకుంటారు జనం. నాలుగేళ్ల క్రితం తనతో పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న నటుడు దర్శన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు సనమ్. నీళ్లలో దిగి ఇంటర్వ్యూలు చేసే అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ సనమ్ ఆవేదన వ్యక్తం చేశారు.
దర్శన్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన సనమ్.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. గ్రాండ్‌గా నిశ్చితార్ధం కూడా జరిగింది.. అలాంటిది దర్శన్ తనను మోసం చేశాడంటూ సనమ్ మీడియా ముందుకొచ్చి బాంబు పేల్చింది. అక్కడితో ఆగకుండా పోలీసులను సైతం ఆశ్రయించారు. పెళ్లి చేసుకుంటానని తనకు ఎన్నో మాటలు చెప్పిన దర్శన్ .. ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని ఆరోపించింది. తనపై సనమ్ చేసిన ఆరోపణలను దర్శన్ కూడా స్వయంగా మీడియా ముందుకొచ్చి ఖండించారు.

సనమ్‌తో నిశ్చితార్ధం జరిగిన మాట వాస్తవమేనని.. కానీ తన కుటుంబ సభ్యులకు ఈ సంగతి తెలియదని దర్శన్ చెప్పారు. తన చెల్లికి పెళ్లి కాకుండా తాను చేసుకుంటే ఇబ్బందులు వస్తాయని.. ముందు ఆమెకు వివాహం చేసి తర్వాత మనం ఒక్కటవుదామని చెప్పానని కానీ సనమ్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని వెల్లడించారు. తాను కమిటైన సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్ కంపెనీలకు వెళ్లి తన గురించి ఉన్నవి లేనివి చెప్పేదని దర్శన్ ఆరోపించారు. ఇంత జరిగాక ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరి గొడవ చానాళ్ల పాటు మీడియాకి పని పెట్టింది.
ఇదొక్కటే కాదు.. బిగ్‌బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుని ఆ ప్రోగ్రామ్‌పైనే సంచలన వ్యాఖ్యలు చేసింది సనమ్. ఈ రియాలిటీ షోలో పాల్గొనడం వల్ల తన కెరీర్‌కు ఎలాంటి యూజ్ లేదని, అవకాశాలు క్యూకట్టలేదని సనమ్ ఆరోపించింది. బిగ్‌బాస్ తర్వాత తనకు వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా వచ్చిన లాభమేమీ లేదని ఆమె వ్యాఖ్యానించింది. దీంతో నెటిజన్లు సనమ్‌కు ఆన్‌లైన్‌లో గట్టి బుద్ధి చెప్పారు. ఆ తర్వాత కొద్దిరోజులు సైలెంట్ అయిన ఆమె మళ్లీ తన సోషల్ మీడియాకు పనిచెప్పారు. దీనిలో భాగంగా వరలక్ష్మీ వ్రతం నాడు ఓ వీడియో పోస్ట్ చేసిన సనమ్ శెట్టి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇవాళ మనం మహాలక్ష్మీ దేవి పూజను జరుపుకుంటున్నామని.. కానీ మధ్య నడిచే దేవతలు అత్యాచారానికి, హత్యలకు గురవుతారు. ప్రాణాలను పోసే దేవదూత లాంటి జూనియర్ డాక్టర్ మౌమిత దేబ్‌నాథ్‌తను అనాగరికంగా హత్య చేస్తే.. కోల్‌కతాలో 'రీక్లెయిమ్ ది నైట్ ' అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. నేను దానిని చెన్నైలో 'క్లెయిమ్ ది నైట్'గా ప్రారంభించాలనుకుంటున్నా.
ఈ నిరసనలో నాతో కలిసి బాధితురాలికి న్యాయం చేయడంలో సాయం చేయాలని కోరుతున్నానని శెట్టి తెలిపారు. అక్కడితో ఆగితే బాగుండేది కానీ ఇదే వీడియో సనమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఆడపిల్ల అనుమతి లేకుండా అమెను తాకడానికి ఎవరికి అధికారం లేదన్నారు. తాను ఓ నటిని, ఎంటర్‌టైన్ చేయడమే నా వృత్తి అలాగని ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోనని సనమ్ శెట్టి తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











