బుజ్జిగాడు హీరోయిన్ సీమంతం వేడుక.. కుటుంబ సభ్యుల కంటే వీళ్లే బెటర్ అంటూ ఎమోషనల్
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సంజనా గల్రానీ ఇటీవల కాలంలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా వార్తల్లో నిలుస్తోంది. మోడల్ గా ఒకప్పుడు మంచి గుర్తింపు అందుకని ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించిన సంజన ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఇక ఆమె జీవితంలో పలు రకాల వివాదాస్పద విషయాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఇక ఇటీవల తల్లి కాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆమెకు సంబంధించిన సీమంత వీడియోను పోస్ట్ చేస్తూ ఎమోషనల్ గా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ సినిమాతో..
మొదట 2005లో సోగ్గాడు అనే సినిమాలో సంజనా గల్రానీ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించింది. ఇక ఆ తర్వాత ఆమెకు తమిళ కన్నడ ఇండస్ట్రీ లో కూడా చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ఎక్కువగా ఆమె క్రేజ్ వచ్చింది మాత్రం పూరి జగన్నాథ్ ప్రభాస్ కలయికలో వచ్చిన బుజ్జిగాడు సినిమా ద్వారానే. అందులో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటించినప్పటికీ కూడా సంజన పాత్రకు మంచి క్రేజ్ అయితే దక్కింది.

అలాంటి సినిమాలతో..
ఇక సంజన ఒకవైపు కన్నడ సినిమాలను మరోవైపు తెలుగు సినిమాలలో వరుసగా చేసుకుంటూ వచ్చింది. ఎక్కువగా ఆమె మీడియం రేంజ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపిస్తూ ఆ తర్వాత చిన్న సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా కనిపించే ప్రయత్నం చేసింది. ఆ సినిమా ద్వారా ఆ పాత్రలతో ఆమె మంచి ఆదాయాన్ని కూడా సొంతం చేసుకుంది.

జైలు జీవితం..
అయితే సంజన సినీ జీవితంలో మాత్రం కొన్ని వివాదాస్పద విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె డ్రగ్స్ కేసులో కూడా పలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో సంజన పేరు కూడా బయటకు రావడంతో ఆమె దాదాపు మూడు నెలల పాటు జైలు జీవితం కూడా చూడాల్సి వచ్చింది.

సీక్రెట్ గా మ్యారేజ్
ఇక జైలు నుంచి వచ్చిన తర్వాత సంజన వెంటనే తన చిరకాల మిత్రుడు డాక్టర్ షాషాను వెంటనే పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పెళ్లి చేసుకున్నట్లు కూడా చాలా రోజుల తర్వాత తెలిసింది. రీసెంట్ గా ఆమె తల్లి అవుతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అసలు సంజనకు పెళ్లి అయినట్లు కూడా తెలియదు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.

ఎమోషనల్ పోస్ట్..
రీసెంట్ గా సోషల్ మీడియాలో సంజన తన సీమంతానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో పోస్ట్ చేసింది. కొన్నిసార్లు కుటుంబసభ్యుల కంటే కూడా స్నేహితులే బెటర్ అనిపిస్తుంది అంటూ ఎంతో ప్రేమగా నా సౌత్ స్నేహితులు ఈ సీమంతం వేడుకను నిర్వహించారని, ఇప్పుడు 9వ నెలలో కి ప్రవేశించినట్లు చెప్పింది. అంతేకాకుండా మరొక నెలలో తనకు పుట్టబోయే బిడ్డను చూస్తారు అని కూడా ఆమె ఎమోషనల్గా స్పందించింది.


Click it and Unblock the Notifications











