అవకాశాల కోసం కొందరూ లొంగిపోతున్నారు.. కానీ..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి స‌త్య‌కృష్ణ‌ (Satya Krishnan). ముఖ్యంగా 'ఆనంద్' సినిమాలో రూప ఫ్రెండ్ అనితగా గుర్తింపు పొందిన సత్య కృష్ణన్, అనేక చిత్రాల్లో అక్క, వదిన, ఫ్రెండ్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్నో మంచి మంచి క్యారెక్ట‌ర్లు చేసిన స‌త్య కృష్ణన్ తెలుగు వాళ్ల‌కు అభిమాన న‌టి అయ్యారు. అయితే.. తాజాగా స‌త్య‌కృష్ణ‌ ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, మహిళల పరిస్థితులు, తన వ్యక్తిగత అనుభవాలపై స్పష్టంగా మాట్లాడింది. ఈ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

సత్య కృష్ణన్ నట ప్రయాణం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆమె అసలు నటిగా మారాలని అనుకోలేదు. హోటల్ మేనేజ్మెంట్ చదివి, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో ఉద్యోగం చేస్తూ ఉన్న సమయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల దృష్టిలో పడి 'డాలర్ డ్రీమ్స్' సినిమాలో అవకాశం పొందింది. ఆ తర్వాత 'ఆనంద్' సినిమాలో నటించి నంది అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత పూర్తిగా ఉద్యోగాన్ని వదిలి సినిమాలపై దృష్టి పెట్టిన సత్య కృష్ణన్, 'బొమ్మరిల్లు', 'వినాయకుడు', 'దేవదాస్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వంటి ఎన్నో చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది.

Actress Satya Krishnan Opens Up on Casting Couch Urges Women to Say No Boldly

ఆ ఇంటర్య్వూలో నటి సత్య కృష్ణన్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం ఉందని నేరుగా అంగీకరించింది. అయితే అది కేవలం సినిమా రంగానికే పరిమితం కాదని, అన్ని రంగాల్లో కూడా అలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పింది. 'ఫిల్మ్ ఇండస్ట్రీ గురించే ఎక్కువగా మాట్లాడతారు, ఎందుకంటే ఇది ఓపెన్ ప్లాట్‌ఫామ్. ఇక్కడ జరిగే విషయాలు త్వరగా బయటపడతాయి. కానీ వాస్తవానికి ఈ సమస్య ప్రతి రంగంలోనూ ఉంటుంది' అని ఆమె పేర్కొంది.

మహిళలపై వివక్ష అంశంపై స్పందిస్తూ.. 'అది ఏ ఇండస్ట్రీలో లేదు చెప్పండి? కానీ మనం మన జీవితాన్ని ఎలా డీల్ చేస్తామనేదే ముఖ్యమైంది' అని చెప్పింది. తనకు వ్యక్తిగతంగా అలాంటి అనుభవం ఎదురుకాలేదని స్పష్టం చేసిన సత్య కృష్ణన్, కానీ అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వారిని చూసినట్లు తెలిపింది. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. 'అందంగా ఉండే మహిళలపై ఆకర్షణ సహజం. కానీ మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటామనేదే కీలకం. మహిళలకు ధైర్యం ఉండాలి. ఎవరైనా లిమిట్స్ దాటితే, వెంటనే 'నో' చెప్పగలగాలి' అని స్పష్టంగా చెప్పింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. 'కమిట్‌మెంట్‌కి ఒప్పుకోకపోతే అవకాశాలు రావని భావించి కొందరు లొంగిపోతారు. కానీ అది సరైన దారి కాదు. 'ఇది కాకపోతే నాకు లైఫ్ లేదు' అనే ఆలోచనతో ఇండస్ట్రీకి వచ్చే వాళ్లే ఎక్కువగా ఇబ్బందులు పడతారు. మనకు మరెన్నో అవకాశాలు ఉన్నాయనే నమ్మకం ఉంటే ఎవరూ ఒత్తిడి చేయలేరు'అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక 'మీ టూ' ఉద్యమం సమయంలో తన దగ్గరకు వచ్చి అనుభవాలు చెప్పిన మహిళల గురించి కూడా ఆమె ప్రస్తావించింది.

'కొంతమంది భయంతో, కొంతమంది తమకు జరిగిన విషయాలు షేర్ చేసుకోవాలని నా దగ్గరకు వచ్చారు. కానీ నేను అలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదు కాబట్టి, వాళ్లకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు' అని తెలిపింది. అలాగే కొందరు అవకాశాల కోసం స్వచ్ఛందంగా ఒప్పుకుని, తర్వాత దానిని పెద్ద విషయం చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయని ఆమె అభిప్రాయపడింది. 'తప్పు చేసినవాళ్లు కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజంగా ధైర్యంగా నిలబడితే ఎవరూ మనల్ని బలవంతం చేయలేరు' అని ఆమె అభిప్రాయపడింది.

ఈ ఇంటర్య్వూలో సత్య కృష్ణన్ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలోని వాస్తవాలను మరోసారి బయటపెట్టాయి. ముఖ్యంగా మహిళలు తమ హక్కుల కోసం ధైర్యంగా నిలబడాలని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా 'నో' చెప్పగలిగే సాహసం ఉండాలని ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X