మళ్లీ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ..అపురూప కానుక అంటూ..
టాలీవుడ్ నటి నటి షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల నటి రెండోసారి తల్లైంది. శనివారం (మార్చి 14) తెల్లవారుజామున ఆమెకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని పూర్ణ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ పోస్టులో పూర్ణ ఇలా పేర్కొంది. 'అల్లాహ్ కృపతో ఈరోజు ఉదయం 4 గంటల 25 నిమిషాలకు మా కుటుంబంలో పాప పుట్టింది. ఆమె మా జీవితాల్లోకి వచ్చిన అమూల్యమైన వరం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ జరగడం కోసం భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ఎంతో మద్దతు ఇచ్చిన ఆసుపత్రి బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు" అని ఆమె పేర్కొంది.

ఇదిలాఉంటే.. టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ నటి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా అల్లరి నరేష్ సరసన నటించిన 'సీమ టపాకాయ్'సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.ఆ తర్వాత దర్శకుడు రవి బాబు తెరకెక్కించిన 'అవును' సినిమాలో నటించి మరింత గుర్తింపు పొందింది.
పూర్ణ తన సినీ ప్రయాణంలో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అవును 2, దృశ్యం 2, అఖండ, దసరా వంటి చిత్రాల్లో నటించి తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుకుంది. ఇటీవల నాని నటించిన 'దసరా' సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి స్పందన వచ్చింది.
ఇక పూర్ణ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె 2022లో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీ ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2023లో హమ్దాన్ ఆసిఫ్ అలీ అనే కుమారుడు జన్మించాడు. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పూర్ణ, ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూనే పలు టీవీ కార్యక్రమాల్లో జడ్జిగా కూడా కనిపిస్తోంది.
తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. పూర్ణకు పాప పుట్టిన వార్త తెలుసుకున్న వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తల్లి, పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











