నా భర్త సపోర్ట్ తోనే ఆ సీన్‌లో నటించా.. కానీ ఆ థంబ్ నైల్స్ తో బాధపడ్డా..
నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరుకుతే .. ప్రతి నటులు, నటీమణులు తమ బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వాలని భావిస్తారు. కథకు అవసరమైతే ఎలాంటి సన్నివేశాలోనైనా నటించడానికి సిద్ధమవుతారు. కొందరు నటులు సాహసాలకు కూడా వెనకాడరు. అలా రొమాన్స్ సన్నివేశాలలో లేదా బోల్డ్ పాత్రలలో కనిపించడానికి కూడా వెనకాడరు. అలాంటి సాహసమే చేసింది ఓ నటి. పాత్ర కోసం.. ఆ సీన్ మరింత బాగా రావాలని బోల్డ్ గా నటించింది. అలా నటించడానికి తన భర్త మద్దతుగా నిలిచారంట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఓ లుక్కెయ్యండి.
ఆ నటి ఎవరో కాదు.. ఫిదా సినిమాలో హీరోయిన్ సాయి పల్లవికి అక్కగా నటించిన నటి శరణ్య ప్రదీప్ (Sharanya Pradeep). ఆ సినిమాతో ఈ నటికి మంచి క్రేజ్ వచ్చింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించే అవకాశాన్ని పొందింది. శరణ్య ప్రదీప్ చాలా సినిమాలలో కీలక పాత్రలలో నటించింది. కానీ ఎవరు ఊహించని విధంగా యంగ్ హీరో సుహాస్ నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో ఓ సీన్ లో ఏకంగా వివస్త్రగా నటించి అందరికి షాక్ ఇచ్చింది. విమర్శల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.

నటి శరణ్య ప్రదీప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమాలో ఆ సన్నివేశం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఆ పాత్ర గురించి తాను ఎంతో భయపడ్డానని, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని, చాలా టెన్షన్ పడ్డారని అన్నారు. కానీ రిలీజ్ అయిన తర్వాత తన గురించి ఎలాంటి నెగటివ్ ప్రచారం గానీ, చెడు అభిప్రాయంగానే రాలేదని, తన నటనకు మంచి మార్కులు పడ్డాయని తెలిపారు శరణ్య ప్రదీప్.
'సినిమాలో న్యూడ్ క్యారెక్టర్ గురించి తనకు డైరెక్టర్ మొదట వివరించారు. ఏ నటి అయిన తన పాత్రకు 100% న్యాయం చేయాలని భావిస్తుంది. నేను కూడా అలానే భావించాను. డైరెక్టర్ థాట్ ప్రాసెస్ నాకు నచ్చింది. కానీ, ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఎలా ఫీలవుతారు.తనని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే విషయంలో నేను చాలా బాధపడ్డాను. క్యారెక్టర్ గురించి ఏమైనా బ్యాడ్ గా అనుకుంటారా ? అని చాలా టెన్షన్ పడ్డాను. అన్నారు శర్యణ ప్రదీప్.
'ఆ తర్వాత ఆ విషయాన్ని నా భర్త కూడా చెప్పాను. డైరెక్టర్ ఎలా తీయాలో క్లారిటీ ఉన్నప్పుడు.. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావ్? అంటూ నాకు సపోర్ట్ గా నిలిచారు. తాను ఈ సీన్ కు సపోర్ట్ చేయకపోతే.. నేను అసలు ప్రాజెక్టు చేసేదాన్ని. డైరెక్టర్ ఆ సీన్ తీసేవాడు లేదో.. చివరికి ఏమైందో తెలియదు. కానీ, మా హస్బెండ్ సపోర్ట్ చేయడంతో నేను ఆ సీన్లో నటించాను'శర్యణ ప్రదీప్ అని తెలిపారు..

ఆమె ఇంకా మాట్లాడుతూ..' సినిమా రిలీజ్ కి ముందు వరకు ఆ సీన్ గురించి ఎంతో టెన్షన్ పడ్డాను. కానీ, ప్రీమియర్ చూశాక.. ఆ టెన్షన్ పూర్తిగా పోయింది. ఎవరు కూడా నా సీన్ గురించి వల్గర్ గా.. నెగిటివ్గా ..మాట్లాడలేదు. నా పాత్రకు కంప్లీట్ గా పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే.. కొన్ని చానల్ వారు తన సీన్స్ ను థంబ్ నెల్స్ గా పెట్టి ఇష్టవచ్చినట్టు వార్తలు చేశాయి. అప్పుడు కొన్నిసార్లు ఇబ్బందిగా ఫీలయ్యాను. ఆ విషయం తనని ఎంతగానో బాధ పెట్టింది. వాస్తవానికి ఆ సీన్ చేసేటప్పుడు నాకే సెకండ్ థాట్ రాలేదు. కానీ, వేరేలా ఎలా ఆలోచిస్తారు . ఆ సీన్ చేసేటప్పుడు మా ఆయనతో డిస్కస్ చేశాను. ఆయన సపోర్ట్ వల్లనే ఇంకా సినిమాలలో కంటిన్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు శరణ్య ప్రదీప్.


Click it and Unblock the Notifications











