Ambajipeta Marriage Band: న్యూడ్ సీన్ చేయడానికి చాలా భయపడ్డాను.. మా ఆయన వల్లే.. శరణ్య ఎమోషనల్
కలర్ ఫొటో ఫేమ్ సుహాస్ హీరోగా తాజాగా వచ్చిన సినిమా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. సినిమా చాలా బాగుందని చెబుతూనే.. అందులో నటించిన ప్రతీ ఒక్కరికి మంచి మార్కులు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో చేసిన నటి శరణ్య ప్రదీప్ క్యారెక్టర్ కు అయితే చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఆరోజు థియేటర్లో అందరితోపాటు సినిమా చూసేందుకు వెళ్లిన శరణ్య తన తెరపై చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని ఓ న్యూడ్ సీన్ చేయడానికి ఎంతో భయపడ్డానని తెలిపింది. ఆ వివారేలంటో మనం ఇప్పుడు చూద్దాం.
దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సుహాస్ హీరోగా చేయగా.. శివానీ నగరం హీరోయిన్‌గా నటించి మెప్పించింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం రోజు అంటే ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా డీసెంట్ టాక్ తో దూసుకెళ్తోంది. వెంకటేశ్ మహా సమర్పణలో గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ధీరజ్ మోగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

సుహాస్, శివానీలతో పాటు జగదీష్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ, శరణ్య ప్రదీప్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో సుహాస్ తో పాటు శరణ్య ప్రదీప్ నటనకు గాను వందకు వంద మార్కులు పడుతున్నాయి. శరణ్య యాక్టింగ్ ఇరగదీసిందని అంతా అంటున్నారు. చాలా సన్నివేషాల్లో ఆమె అందరినీ ఏడిపించేసిందని వివరిస్తున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్ వద్ద జరిగిన ఓ సీన్ లో ఆమె జీవించేసిందని అంటున్నారు.
అయితే సినిమా షూటింగ్ సమయంలో తాను ఆ న్యూడ్ సీన్ చేయడానికి చాలా భయపడ్డానని చెప్పింది. కానీ తన భర్త సహకారం, ప్రోత్సాహం.. ఆయన ఇచ్చిన ధైర్యం వల్లే తాను చాలా ఈజీగా ఆ క్యారెక్టర్ చేయగల్గినట్లు వెల్లడించింది. సెట్ లో కూడా ఈ ఒక్క సీన్ జరుగుతున్నప్పుడు కేవలం ఐదుగురు మాత్రమే అక్కడ ఉండి.. తాను సీన్ చక్కగా చేసేలా ప్రోత్సహించారని.. తాను భయపడకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు.

అందరి సహకారం వల్లే తాను ఆ సీన్ లో జీవంచగల్గానని నటి శరణ్య ప్రదీప్ చెప్పింది. ఆ సీన్ చూసి.. థియేటర్లలో అందరూ ఏడుస్తుంటే.. తన జీవితం ధన్యం అయిపోయిందని వివరించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే తనకు కన్నీళ్లు ఆగడం లేదని.. సినిమా కథ తెలిసినప్పటి నుంచే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుందని తాను భావించినట్లు వెల్లడించింది. తాను అనుకున్నట్లుగానే సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. చూడాలి మరి ఈ చిత్రం ఏ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనేది.


Click it and Unblock the Notifications











