Shilpa Shetty: బికినీలో శిల్పా శెట్టి ఎక్స్‌పోజింగ్.. ఆ యాంగిల్‌లో అన్నీ కనిపించేలా!
సాధారణంగా చాలా మంది హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ఇండియా వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో సీనియర్ బ్యూటీ శిల్పా శెట్టి ఒకరు.
ఉత్తరాది నుంచి దక్కిణాది వరకూ అన్ని భాషల్లోనూ నటించి మెప్పించిన ఈ భామ.. తన రేంజ్‌ను అప్పట్లోనే పాన్ ఇండియా స్థాయికి పెంచుకుంది. ఇక, ఈ మధ్య స్పీడు తగ్గించినా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా శిల్పా శెట్టి ఓ హాట్ బికినీ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరే ఓ లుక్కేయండి మరి!

బాజీగర్‌తో.. ఫుల్ పాపులర్: చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టిన శిల్పా శెట్టి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీంతో ఆమెకు చాలా భాషల్లో ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే 'బాజీగర్' అనే చిత్రంతో ఈ అమ్మడు హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని ఎన్నో అవార్డులు సైతం అందుకుంది. తర్వాత బోలెడన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించింది.

తెలుగులో స్టార్ హీరోలతో: బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో స్టార్‌గా ఎదిగిన శిల్పా శెట్టి 'సాహస వీరుడు సాగర కన్య' అనే సినిమాతో తెలుగులోకి ఎంటరైంది. ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'వీడెవడండీ బాబు', 'ఆజాద్', 'భలేవాడివి బాసూ' వంటి చిత్రాలు చేసింది. అయితే, వీటి తర్వాత శిల్పా టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చి మళ్లీ వేరే భాషలపైనే ఫోకస్ చేసేసింది.

భర్త కేసు.. ఫుల్ సపోర్టుగా: కెరీర్ పరంగా ఇప్పటికీ తన రేంజ్‌కు తగ్గ ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతోన్న శిల్పా శెట్టి.. భర్త రాజ్‌కుంద్రా కేసుతో పెద్ద వివాదంలోనే చిక్కుకుంది. ఆయన జైలుకు వెళ్లిన సమయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. ఈ మొత్తం వ్యవహారంలో శిల్పా తన భర్తకు ఫుల్ సపోర్టును అందించింది.

ఇప్పుడు కూడా బిజీగానే: 48 ఏళ్ల వయసు దాటిపోయినా శిల్పా శెట్టి మాత్రం ఎంతో స్పీడుగానే సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది 'నికమ్మ' అనే చిత్రంతో వచ్చింది. అలాగే, ఇప్పుడు 'కేడీ', 'సుఖీ' వంటి సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు, Indian Police Force అనే వెబ్ సిరీస్‌లోనూ శిల్పా శెట్టి భాగం అయింది. వీటితో పాటు కొన్ని షోలలో కూడా పాల్గొంటూ రచ్చ లేపుతోంది.

సోషల్ మీడియాలో రచ్చ: చాలా కాలం నుంచే శిల్పా శెట్టి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆమె తరచూ ఏదో ఒక ఫొటోలు పెడుతూనే ఉంటోంది. అంతేకాదు, తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విషయాలను రకరకాల పోస్టుల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను భారీగానే పెంచుకుంటోంది.

హాట్ షోతో రెచ్చగొడుతూ: సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా సందడి చేస్తోన్న సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే 48ఏళ్ల వయసు దాటినా తన బాడీ పార్టులను చూపిస్తూ కుర్రకారును టెంప్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ రచ్చ చేస్తూనే.. శిల్పా శెట్టి ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తుంది.

బికినీలో శిల్పా హాట్ షో: కొంత కాలంగా విపరీతంగా హడావిడి చేస్తోన్న శిల్పా శెట్టి.. తాజాగా ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె బికినీ ధరించి దర్శనమిచ్చింది. అంతేకాదు, సైడ్ యాంగిల్ నుంచి అందాలన్నీ కనిపించేలా ఫోజు పెట్టింది. ఫలితంగా శిల్పా శెట్టి షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











