ఫస్ట్ టైం హద్దులు దాటేసిన శివానీ రాజశేఖర్ .. కొలతలు చూపిస్తూ అరాచకం!
సినీ నేపథ్యం ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎంతో మంది నటీనటులు కష్టపడుతూనే ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ - జీవిత దంపతుల కుమార్తె శివానీ రాజశేఖర్. అందం, అభినయం అన్ని పుష్కళంగా ఉన్నప్పటికీ ఎందుకో ఈమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు రావడం లేదు. అయినప్పటికీ తన వంతు ప్రయత్నాలు తీవ్రంగా కొనసాగిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శివానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
జీవిత- రాజశేఖర్‌ల పెద్ద కుమార్తె శివానీ. చెన్నైలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ పెరిగారు. తండ్రి అడుగుజాడల్లోనే ఈమె కూడా డాక్టర్ కావాలనుకుంది. అలాగే రాజశేఖర్ మాదిరిగానే యాక్టర్‌గానూ ఎంట్రీ ఇచ్చింది. తొలుత అడివి శేష్ హీరోగా నటించిన '2 స్టేట్స్' ద్వారా వెండితెరపై డెబ్యూ ఇవ్వాల్సింది కానీ, ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత రిలీజ్ ఆగిపోయింది. ఎన్నో కలలు, ఆశలతో వెండితెరపై వెలిగిపోవాలనుకున్న శివానీ తొలి ప్రయత్నం అలా విఫలం కావడంతో నిరాశ చెందారు.

అయితే కొంత గ్యాప్ తీసుకుని.. 'అద్భుతం' అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు. టైం లాప్స్ అనే కాన్సెప్టుతో ఇది రూపొందింది. నేరుగా హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా WWW, తండ్రి రాజశేఖర్‌తో కలిసి'శేఖర్'లోనూ కీలక పాత్ర చేసింది.
తెలుగుతో పాటు తమిళంలోనూ సత్తా చాటాలని నిర్ణయించుకున్న శివానీ అన్బరివు', 'నింజాక్ నీతి' అనే సినిమాలు కూడా చేసింది. వీటిలో అద్భుతమైన నటనతో తమిళ తంబీలను అలరించింది. సినిమాలే కాదు మోడల్‌గాను ఆమె రాణిస్తున్నారు. 2022 సంవత్సరానికి గాను ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్‌లో ఆమె పాల్గొనాల్సి ఉంది. అయితే అదే రోజున ఆమె వైద్య వృత్తికి సంబంధించిన కీలకమైన పరీక్ష ఉండటంతో పోటీలో పాల్గొనలేకపోయింది. అయితే ఫెమినా మిస్ ఇండియా కంటే ఒక డాక్టర్ కావడమే గొప్ప విషయమని చెప్పి ప్రశంసలు పొందింది.
చివరిసారిగా గతేడాది విద్యా వాసుల అహం అనే చిత్రంలో నటించింది శివానీ. రాహుల్ విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాను మణికాంత్ గెల్లి డైరెక్ట్ చేశారు. గతేడాది మే 17న ఈ సినిమాను నేరుగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సినిమా తర్వాత కొత్తగా ఏ ప్రాజెక్ట్‌కు శివానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నప్పటికీ.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది శివానీ. తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటోంది.
చాలా రోజులుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న శివానీ చీర ఇతర సాంప్రదాయ దుస్తుల్లోనే ఫోటో షూట్స్ చేస్తుంది తప్పించి పెద్దగా అందాలను ఆరబోయదు అన్న విషయం తెలిసిందే. తాజాగా నేరేడు రంగు చీరలో నడుము అందాలు చూపిస్తూ శివానీ చేసిన ఫోటో షూట్ సెగలు రేపుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం శివానీ రాజశేఖర్ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











