చనిపోయిన మావయ్యను గుర్తు చేసుకుని ఏడ్చేసిన శివాత్మిక రాజశేఖర్
రాజశేఖర్ కూతురు శివాత్మిక త్వరలో 'దొరసాని' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమెకు జోడీగా ఆనంద్ దేవరకొండ నటిస్తున్నాడు. కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా శివాత్మిక మాట్లాడుతూ... డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నిజంగా నన్ను దొరసానిలా చూసుకున్నారు. నా వయసు 19 సంవత్సరాలు. స్కూలు మానేసి సినిమాలు చేస్తానంటే ఒక్కసెకండ్ కూడా ఆలోచించకుండా నీ కళను సాకారం చేసుకో అని అమ్మానాన్న పంపించారు' అని చెప్పుకొచ్చారు.

ఈ సంతోష సమయంలో ఇద్దరు వ్యక్తులను గుర్తు చేసుకోవాలి. నాయనమ్మ, అమ్మమ్మ... ఆ ఇద్దరినీ మేము చాలా మిస్సవుతున్నాం. మా మురళి మామయ్యను 2017లో పోగొట్టుకున్నాం. ఆయన మమ్మీ డాడీ కంటే ఎక్కువగా నాలో సినిమాలపై ఇష్టం పెరిగేలా చేశారు. ఎవరైనా బయటి వ్యక్తులు నా గురంచి అడిగితే మా కోడలు సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటోంది అని చెప్పేవారు. ఆయన ఏ లోకంలో ఉన్నా ఈ ఫంక్షన్ చూస్తున్నారనే అనుకుంటున్నాను. నేను సాధించాను మామయ్యా... అంటూ శివాత్మిక భావోద్వేగానికి గురయ్యారు.
ఆనంద్ దేవరకొండతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. రాజు పాత్రలో ఆయన్ను తప్ప ఎవరినీ ఊహించుకోలేం. ఒక ప్యూర్ అండ్ హానెస్ట్ లవ్ స్టోరీ చేశాం. ఇది మిమ్మల్ని 1980ల్లోకి తీసుకెళుతుంది. జులై 12న మీ ముందుకు వస్తున్నాం. తప్పకుండా చూడండి. మా ఫ్యామిలీని 30 ఏళ్లుగా ఎలా ఆదరిస్తున్నారో అలాగే నన్ను, నా సోదరి శివానిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను... అని శివాత్మక చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











