Shraddha Das: స్పోర్ట్స్ బ్రాలో శ్రద్దా హాట్ షో.. పిచ్చెక్కించే యాంగిల్స్‌లో ఘాటుగా!
తెలుగులో ఎంతో మంది హీరోయిన్లుగా సందడి చేస్తున్నా.. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపుతో ముందుకు సాగుతోన్నారు. తద్వారా చాలా కాలం పాటు హవాను చూపిస్తూ సత్తా చాటుతోన్నారు. అందులో హాట్ హీరోయిన్ శ్రద్దా దాస్ ఒకరు.
చాలా కాలం క్రితమే ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ చిన్నది.. కెరీర్ ఆరంభంలో వరుసగా సినిమాలు చేసి అలరించింది. ఈ మధ్య కాలంలో మాత్రం అంతగా రాణించడం లేదు. కానీ, సోషల్ మీడియాను మాత్రం డ్యాన్స్ చేయిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రద్దా దాస్ కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. అవి మీరే చూడండి!

అలా వచ్చి.. ఫుల్ పాపులర్: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్రద్దా దాస్ మోడల్‌గా ప్రయాణాన్ని ఆరంభించింది. ఈ ఫీల్డులో తనదైన గ్లామర్‌తో ఫిదా చేసేసిన ఈ భామ.. జాతీయ స్థాయిలో కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ పని చేసింది. ఆ తర్వాత ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే 'సిద్ధు ఫ్రం సికాకుళం' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. టాలీవుడ్‌లో పాపులర్ అయింది.
ఎన్నో చిత్రాలు.. హిట్లేమో: హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలోనే శ్రద్ధా దాస్.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి హవాను చూపింది. ఇలా ఆమె కెరీర్‌లో 'అధినేత', 'ఆర్య 2', 'మరో చరిత్ర', 'నాగవల్లి', 'డార్లింగ్', 'మొగుడు', 'ముగ్గురు', 'బందిపోటు', 'గుంటూరు టాకీస్', 'డిక్టేటర్', 'పీఎస్వీ గరుడవేగ' వంటి చిత్రాలతో మెప్పించింది. కానీ, హిట్లను పెద్దగా అందుకోలేదు.

ఇప్పుడలా.. బిజీగా ఉంటూ: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా శ్రద్దా దాస్ అవకాశాలు అందుకుంది. అయితే, ఈ మధ్య మాత్రం స్పీడు తగ్గించింది. మరీ ముఖ్యంగా 'పీఎస్వీ గరుడవేగ' తర్వాత ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ, 'ఏక్ మినీ కథ'లో అదిరిపోయే క్యారెక్టర్ చేసింది. ఇక, ఇప్పుడు 'నిరీక్షణ', 'అర్థం' వంటి వాటిలో చేస్తోంది.
ఢీ షోలో యమ హైలైట్‌గా: ఈ మధ్య కాలంలో శ్రద్దా దాస్‌కు ఆశించిన రీతిలో భారీ ఆఫర్లు రావడం లేదు. దీంతో ఈ బ్యూటీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి చిన్న చిత్రాల్లోనూ నటిస్తోంది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి వచ్చిన ఈ హీరోయిన్.. షోలు, ఈవెంట్లలో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈటీవీలో వస్తున్న 'ఢీ' షోలో 15వ సీజన్‌కు జడ్జ్‌గా చేస్తోంది. ఇందులో కూడా శ్రద్దా తన మార్క్‌తో అలరిస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ: హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలో మరింత క్రేజ్ అందుకుంది. అందుకే ఇందులో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ముందుకు సాగుతోంది.
గ్లామర్ షోతో రెచ్చగొట్టేలా: సుదీర్ఘ కాలంగా తనదైన గ్లామర్‌తో సోషల్ మీడియాలో శ్రద్దా దాస్ విపరీతంగా అల్లరి చేసేస్తోంది. ఇందులో ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గీత దాటేసి మరీ హాట్ షో చేస్తోంది. ఫలితంగా శ్రద్దా దాస్ అందాల ఆరబోతతో ఇంటర్నెట్ షేక్ అయిపోతుందని చెప్పాలి.

శ్రద్దా హాట్ పిక్స్ వైరల్‌గా: సోషల్ మీడియాలో హద్దు దాటి రెచ్చిపోతోన్న శ్రద్దా దాస్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్పోర్ట్స్ బ్రాను మాత్రమే ధరించి దర్శనమిచ్చింది. పైగా ఎన్నో రకాల ఫోజుల్లో కనిపించింది. దీంతో ఆమె అందాలు వీటిలో విపరీతంగా కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వచ్చి.. ఓ రేంజ్‌లో వైరల్ అయిపోతోన్నాయి.


Click it and Unblock the Notifications











