పబ్లిక్‌గా మందు కొడుతూ .. బీచ్‌లో హీరోయిన్ అలాంటి పనులు

హీరోలతో పాటు కొందరు హీరోయిన్లకు మందు తాగే అలవాటు ఉంది. అయితే హీరోలు బయటపడినట్లుగా హీరోయిన్లు బయటపడరు. కొందరు ముద్దుగుమ్మలు మాత్రం ఓపెన్‌గా, బోల్డ్‌గా మాట్లాడుతుంటారు. కేరళ కుట్టి సంయుక్త మీనన్ అయితే అప్పుడప్పుడు తాను మందు పుచ్చుకుంటానని పలు వేదికలపై చెప్పింది. తాజాగా ఓ హీరోయిన్‌ ఏకంగా ఫోటోలతోనే ఈ విషయం బయటపెట్టింది. ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకలా చేస్తోంది? ఈ వివరాల్లోకి వెళితే..

జెర్సీతో తెలుగువారిని పలకరించిన శ్రద్ధ
లాయర్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టి హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టారు శ్రద్ధా శ్రీనాథ్. నాని హీరోగా వచ్చిన జెర్సీతో తెలుగువారిని పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. అందరు హీరోయిన్ల మాదిరిగా ఎడాపెడా సినిమాలు చేయకుండా సెలెక్టీవ్‌గా ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కర్ణాటకకు చెందిన శ్రద్ధా శ్రీనాథ్.. తండ్రి ఉద్యోగరీత్యా దేశంలోని పలు ప్రాంతాల్లో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఒకరమైన ఇష్టం ఉండేది ఈ ముద్దుగుమ్మకి.. ప్రతి ఆదివారం సినిమాలు తెల్లారి ఫ్రెండ్స్‌కి కథలు చెప్పేది.

Actress Shraddha Srinath Shared Her Maldives Vacation Photos

లాయర్ కాబోయి యాక్టర్‌గా
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ఫ్రెండ్స్ సూచనతో శ్రద్ధా శ్రీనాథ్ సినీరంగం వైపు క్రమంగా అడుగులు వేశారు. లాయర్‌గా పనిచేస్తూనే థియేటర్ గ్రూప్స్‌లో చేరి నాటకాలు వేయడంతో క్రమంగా వాణిజ్య ప్రకటనల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఈ దశలో మలయాళ చిత్రం కోహినూర్‌లో శ్రద్ధకు ఛాన్స్ దొరికింది. ఈ దశలో యూటర్న్ అనే కన్నడ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు బ్రేక్ దక్కింది. ఈ చిత్రంలో నటనతో శ్రద్ధా శ్రీనాథ్‌కు దక్షిణాదిలో అవకాశాలు క్యూకట్టాయి. విక్రమ్ వేద, జోడీ, కృష్ణ అండ్ హిజ్ లీల, ఇరగపట్రు వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.

మొక్కవోని దీక్షతో నటిగా
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్‌లో హీరో నందమూరి బాలకృష్ణ, విలన్ బాబీ డియోల్‌తో సమానమైన పాత్ర పోషించి మెప్పించారు. ప్రస్తుతం ఆర్యన్ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు శ్రద్ధా శ్రీనాథ్. హీరోయిన్‌గానే నటించాలంటూ గిరి గిసుకుని కూర్చోకుండా కథ, పాత్రను బట్టి స్క్రిప్ట్ ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు శ్రద్ధా శ్రీనాథ్. ఆమె జీవితంలో విజయాలే కాదు అవమానాలు కూడా ఉన్నాయి. కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు జ్ఞాపకాల గురించి కూడా శ్రద్ధా శ్రీనాథ్ పంచుకున్నారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఈ అమ్మాయి ఏడాది కంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండదని అన్నారని .. కానీ తాను నిలదొక్కుకున్నానని శ్రథ్ అన్నారు. నటిగా మారకముందు శ్రద్ధ చాలా లావుగా ఉండేది.. అయితే మొక్కవోని దీక్షతో నాజూగ్గా మారారు.

మాల్దీవుల్లో మందు కొడుతోన్న శ్రీనాథ్
ఇటీవలే కలియుగం 2064 అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించి అలరించిన శ్రద్ధా శ్రీనాథ్.. తీరిక వేళల్లో విహారయాత్రలకు వెళ్తుంటారు. తాజాగా మాల్దీవ్స్‌కు వెళ్లిన శ్రద్ధా శ్రీనాథ్ అక్కడ ఏకంగా బికినీలో హల్‌చల్ చేసింది. అక్కడితో ఆగకుండా ఓ చోట కూర్చొని ఏకంగా మందుకొట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తాను మందు కొడతానని ఈ ముద్దుగుమ్మ ఇంత పబ్లిక్‌గా చెప్పేసిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: shraddha srinath movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X