కొన్ని సార్లు సిగరెట్, మందు తప్పడం లేదు... ప్రతి డైరెక్టర్ అంతే: శ్రీయ
నారా రోహిత్, శ్రీయ, సుధీర్ బాబు, శ్రీవిష్ణు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'వీరభోగ వసంత రాయులు'. ఇంద్రసేన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 26న విడుదల కానుంది. దేశభక్తి నేపథ్యంలో సాగుతున్న భిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ ఇది. మార్క్ కే రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఎస్ వెంకట్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేస్తున్నాడు. బాబా క్రియేషన్స్ బ్యానర్ పై అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు. ఇందులో కీలక పాత్ర పోషించిన శ్రీయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

సీరియస్ పాత్రలో
‘వీర భోగ వసంత రాయలు' చిత్రంలో నా కెరీర్లో ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ పాత్ర పోషించాను. కాలా కొత్తగా ఉంటుంది, సీరియస్‌గా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక మంచి పాత్ర చేశానని సంతృప్తి ఉంది అని తెలిపారు.

మందు కొడతా, సిగరెట్ కూడా
సినిమాలో నేను పోషించిన పాత్ర డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం లాంటివి చేస్తుంది. నాకు రియల్ లైఫ్‌లో స్మోకింగ్ అలవాటు లేదు కానీ సినిమాలోని పాత్ర కోసం చేయక తప్పలేదు. సీన్ చేసే ముందు స్మోక్ చేయడం ప్రాక్టీస్ చేస్తాను అని శ్రీయ తెలిపారు.

గదిలో చాలా ఇబ్బంది ఉంటుంది
గదిలో స్మోకింగ్ సీన్లు షూట్ చేసినపుడు రూమ్ మొత్తం పొగతో నిండి పోతుంది. స్మోక్ అలవాటు లేని నాలాంటి వారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ సీన్ పూర్తి కావడం కోసం అవన్నీ భరించాల్సి ఉంటుంది అన్నారు.

మీటూ గురించి
మీటూ ఉద్యమంపై స్పందిస్తూ... ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు వచ్చి తమకు ఎదురైన సంఘటనల గురించి చెప్పడం గొప్ప విషయం అన్నారు. ఈ ఉద్యమానికి తన మద్దతు ఉెంటుందని, తన 17 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురు కాక పోవడం తన అదృష్టం అన్నారు.

ప్రతి డైరెక్టర్ అంతే...
నా వద్దకు ఏ కథ వచ్చినా.... నన్నే ఎందుకు తీసుకుంటున్నారు? అని డైరెక్టర్లను అడగుతాను. దానికి చాలా మంది నీ ఫేస్ ఆ పాత్రకు వర్క్ అవుతుంది, క్యూట్, ప్రెట్టీ, అందంగా ఉంటావ్ అని చెబుతుంటారు. దాదాపు ప్రతి దర్శకుడు ఇలానే మాట్లాడుతుంటారు. అయితే వీర భోగ వంసత రాయలు దర్శకుడు ఇంద్ర మీరు ఈ పాత్ర బాగా చేస్తారని నమ్ముతున్నాను, ఈ సినిమాలో మీరు నటిస్తే బ్యాక్ బోన్‌లా ఉంటుందని చెప్పడంతో కన్విన్స్ అయ్యాను. స్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాను అని శ్రీయ తెలిపారు.


Click it and Unblock the Notifications











