Shriya Saran సీక్రెట్‌గా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శ్రీయ.. ప్రెగ్నెన్సీ దాచిపెట్టి షాకిచ్చిన బ్యూటీ

అక్టోబర్ 11న సోమవారం నాడు ఆశ్చర్యకరమైన ప్రకటనతో సీనియర్ హీరోయిన్ శ్రీయ సరన్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆమె రష్యన్ పారిశ్రామికవేత్త-భర్త ఆండ్రీ కోస్చీవ్ తో ఉన్న ఫొటోలతో పాటు ఒక పసి పాప ఫొటోను కూడా షేర్ చేసుకున్నారు. ఇక ఫైనల్ గా వారు తల్లిదండ్రులు అయ్యారని వెల్లడించారు. ఇన్ని రోజులు చాలా నార్మల్ గా ఉన్న శ్రీయ సడన్ గా తల్లి అవ్వడం ఏమిటని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆ విషయంపై అమ్మడు సోషల్ మీడియా ద్వారా చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు.

ఫ్యామిలీ లైఫ్ తో బిజీగా

ఫ్యామిలీ లైఫ్ తో బిజీగా

2018 లో వివాహం చేసుకున్న శ్రియా శరన్ ఎప్పటిలానే సినిమాలను కొనసాగిస్తోంది. ఇక ఆమె ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ లైఫ్ కు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తోంది. అయితే లాక్ డౌన్ లో ఉన్నప్పుడు కూడా శ్రీయా ఇంట్లో ఉంటూనే భర్తతో గడిపిన క్షణాలను హ్యాపీగానే అభిమానులతో షేర్ చేసుకుంది.

 మా ఇంట్లోకి దేవత

మా ఇంట్లోకి దేవత

శ్రీయ ఇప్పుడు సడన్ గా 2020 లోనే తాను గర్భవతి అయినట్లు చెబుతూ తన అభిమానులకు తెలియజేసింది. పండంటి ఆడపిల్లకు జన్మనివ్వడంతో అభిమానులు సినీ ప్రముఖులు ఆమెకు విషెస్ అందిస్తున్నారు. "హలో ప్రజలారా 2020 చాలామందికి షాక్ ఇచ్చింది. ఇక మాకు అందమైన విశేషం ఉంది. ప్రపంచం మొత్తం ఒక అందమైన గందరగోళాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మా ప్రపంచం శాశ్వతంగా మారిపోయింది. సాహసాలు, ఉత్సాహం మరియు అభ్యాసంతో నిండిన ప్రపంచంలో మేము ఒక ఆశీర్వాదం పొందాము అంటూ మా జీవితంలో దేవదూత వచ్చింది అని అందుకు మేము దేవునికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అని శ్రీయ వివరణ ఇచ్చింది.

ఫొటోలు వైరల్

ఫొటోలు వైరల్

ఇక అందుకు సంబంధించిన ఫొటోలను వీడియోలను కూడా శ్రీయ సోషల్ మీడియాలో బాగానే షేర్ చేసుకుంటోంది. వీడియోలో శిశువుకు నీరు అవసరమని శ్రియ తన భర్తతో సరదాగా చెప్పడం చూడవచ్చు. అలాగే ఆండ్రీ సిప్పర్ నుండి నీరు తాగుతున్నట్లు అనిపిస్తుంది. ఆండ్రీ ఒక గ్లాస్ కంటైనర్ చివరను ఆమె బొడ్డుపై ఉంచి మరొక దాన్ని చెవి దగ్గర పెట్టుకొని ఉన్నాడు.

సైలెంట్ గానే సర్ ప్రైజ్ ఇచ్చిన శ్రీయ

సైలెంట్ గానే సర్ ప్రైజ్ ఇచ్చిన శ్రీయ

ఈ సంవత్సరం మొదట్లోనే ఈ జంట స్పెయిన్‌లోని బార్సిలోనా నుండి భారతదేశానికి మకాం మార్చుతున్నట్లు వెల్లడించింది. ఇక ఆడబిడ్డకు జన్మనిచ్చిన అనంతరం శ్రీయ సైలెంట్ గా కొన్ని షూటింగ్స్ తో బిజీ అవ్వడం విశేషం. ఏడాది పాటు చాలా సైలెంట్ గా దాచిన ఈ విషయాన్ని సడన్ గా బయటకు చెప్పడంతో ఆ వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఇక గత 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న శ్రీయా దాదాపు తెలుగు, తమిళ్ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.

పేరు ఏమిటంటే.. ఫొటోలు వైరల్

పేరు ఏమిటంటే.. ఫొటోలు వైరల్

ఇక అందుకు సంబంధించిన ఫొటోలను వీడియోలను కూడా శ్రీయ సోషల్ మీడియాలో బాగానే షేర్ చేసుకుంటోంది. వీడియోలో శిశువుకు నీరు అవసరమని శ్రియ తన భర్తతో సరదాగా చెప్పడం చూడవచ్చు. అలాగే ఆండ్రీ సిప్పర్ నుండి నీరు తాగుతున్నట్లు అనిపిస్తుంది. ఆండ్రీ ఒక గ్లాస్ కంటైనర్ చివరను ఆమె బొడ్డుపై ఉంచి మరొక దాన్ని చెవి దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఇక కూతురికి రాధ అనే పేరు కూడా పెట్టుకున్నారట.

Recommended Video

'Aranya' Movie Motion Poster Released
 RRR సినిమాలో కీలక రోల్

RRR సినిమాలో కీలక రోల్

నాలుగు పదుల వయసులోకి వచ్చిన తరువాత కూడా శ్రీయా తనదైన గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంటోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమె ఒక సరికొత్త సర్ ప్రైజ్ ఇవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఆడ కూతురికి జన్మనిచ్చిన సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక శ్రీయా RRR సినిమాలో అజయ్ దేవగన్ కు జోడిగా నటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X