బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన శ్రీయ: ఆ పార్టులన్నీ చూపిస్తూ దారుణంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా హవాను చూపించారు. తద్వారా సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపిస్తూ స్టార్లుగా వెలుగొందారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి శ్రీయ సరన్ ఒకరు. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుందామె. అంతేకాదు, బడా స్టార్ల సినిమాల్లో అవకాశాలను అందుకుని సత్తా చాటింది. ఇలా చాలా కాలం పాటు సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం వెండితెరపై పెద్దగా సందడి చేయట్లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం యమ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

అలా పరిచయం.. ఫుల్ పాపులర్
మోడల్‌గా హవాను చూపిస్తోన్న సమయంలోనే శ్రీయ సరన్ 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'సంతోషం'తో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ భామ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుంది. ఫలితంగా యమ పాపులర్ అయింది.

ఇక్కడే కాదు.. ఆ భాషల్లో హవానే
సుదీర్ఘ కాలం పాటు తెలుగులో హవాను చూపించిన శ్రీయ సరన్.. ఇక్కడి స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. దీంతో తన మార్కును చూపిస్తూనే వచ్చింది. ఇక, తన కెరీర్‌లో శ్రీయ తెలుగులోనే కాదు.. దక్షిణాది భాషల్లోనూ చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా రాణించింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ పలు చిత్రాలు చేసింది. ఇలా చాలా భాషల్లో హవాను చూపించింది.

లవ్ మ్యారేజ్.. తల్లై షాకిచ్చింది
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో లవ్ ట్రాక్ సాగించిన తర్వాత.. అంటే 2018లో అతడిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అలాగే, మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులతో పాటు సినీ ప్రియులంతా షాక్ అయ్యారు.

ఆ రెండు మూవీలే.. ఆఫర్లు లేవు
పెళ్లికి ముందు వరుసగా సినిమాలు చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో అంతగా ఆఫర్లను అందుకోలేకపోతోంది. ఇక, ఇటీవలే ఆమె 'గమనం' అనే సినిమాలో ప్రధాన పాత్రను పోషించిన ఆమె.. RRR మూవీలోనూ భాగమైంది. కానీ, ఇవి శ్రీయ కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ కొన్ని చిత్రాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మాత్రం తెలుస్తోంది.

సోషల్ మీడియాలో హడావిడిగా
చాలా ఏళ్ల పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో వెండితెరపై పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. అంతేకాదు, ఇందులో తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న హీరోయిన్
ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న శ్రీయ సరన్.. ఇందులో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ వదులుతోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న, రొమాంటిక్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా హైలైట్ అయ్యేలా వార్తల్లో నిలుస్తోంది.

బీచ్‌లో బికినీలో రెచ్చిపోయింది
సీనియర్ హీరోయిన్ శ్రీయ సరన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో బికినీ ధరించి తెగ రచ్చ చేస్తోంది. అంతేకాదు, రకరకాల భంగిమల్లో ఫోజులు ఇచ్చి మరీ రెచ్చిపోయింది. ఫలితంగా శ్రీయ అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చి వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











