42 ఏళ్ల వయసులో అందాల ఆరబోత.. బీచ్ లో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్ ..

ఒకప్పుడు టాప్ హీరోలందరితో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్‌లో టాప్ హీరోలందరితో నటించడమే కాకుండా అదే సమయంలో అప్ కమ్మింగ్ హీరోలతోనూ సినిమాలు చేసింది. అటు సీనియర్స్, ఇటు జూనియర్స్ అంటూ అందరితో కలిసి రొమాన్స్ చేసింది. అలా మెగాస్టార్ చిరు, బాలయ్య, నాగార్జున ,వెంకటేష్ లాంటి నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. టాలీవుడ్‌లో పీక్ టైంను చూసింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కొన్ని సంవత్సరాలు గా దూరంగా ఉన్న అమ్మడు ఇటీవలే రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా 42 ఏండ్ల ఈ అమ్మడు తన బికినీ పోజులతో కుర్రాళ్లకు దిమ్మ తిరిగి పోయేలా చేస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..?

ఆ స్టార్ బ్యూటీ ఎవరో కాదు.. అలనాటి అందాల తార, అగ్ర కథానాయక శ్రియ (Shriya Saran). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న శ్రియ కెరీర్ తెలుగులో మొదలైంది తెలుగులోనే. తొలుత ఇష్టం అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల పరిచయం అయింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో తన రెండో సినిమా 'సంతోషం' లో హీరో కింగ్ నాగార్జున తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ తరువాతం బాలయ్య చెన్నకేశవరెడ్డి మూవీలో నటించే అవకాశం అందుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో స్టార్ గా అవతరించింది.

Actress Shriya Saran latest Bikini hot photoshoot goes viral

ఈ క్రమంలోనే టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో నటించింది శ్రియ. అంతేకాదు..తరుణ్, ఉదయ్ కిరణ్ వంటి యంగ్ హీరోల సరసన కూడా నటించింది. ఇక ఆమె కెరీర్ ఠాగూర్, ఛత్రపతి వంటి బ్లాక్ బస్టర్స్ మైల్ స్టోన్స్ గా నిలిచిపోయాయి. ఆ తరువాత రజనీకాంత్ 'శివాజీ' అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. అతికొద్ది కాలంలో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది. అక్కడ కూడా తన నటనతో గ్లామర్ తో హిందీ ప్రేక్షకులను మెప్పించింది. వయసు పెరిగిన కొద్దీ అందాన్ని కూడా పెంచుకుంటూ అభిమానులను అట్రాక్ట్ చేస్తూ ఉంది ఈ సుందరి.

శ్రియ గొప్ప డాన్సర్, అంతకు మించి మంచి నటి. ఆమె అందానికి టాలెంట్ తోడు కావడంతో శ్రియ కెరీర్ సుదీర్ఘంగా సాగింది. ఆ తరువత రష్యాకు చెందిన ఆండ్రీ ను ప్రేమించి 2018లో పెళ్లి చేసుకుంది శ్రియ. లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. శ్రియ కూతురు పేరు రాధ. అటు పర్సనల్ లైఫ్ ను.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను.. బ్యాలెన్స్ చేస్తోంది. దాదాపు 7 సంవత్సరాల తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. శ్రియ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. 'సూర్య44' అనే సినిమాలో హీరోయిన్ శ్రియ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వెయ్యబోతుందట. ఈ విషయాన్ని శ్రియనే వెల్లడించింది.

ఇదెలా ఉంటే.. కాస్త విరామం దొరికినా వెకేషన్ కి వెళ్లిపోతుంది శ్రియా శరన్. ప్రొఫెషనల్ గా ఎంత బిజీ బిజీగా ఉన్న పర్సనల్ లైఫ్ కు కూడా సమయం కేటాయించాలని, ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయకూడదనే సిద్దాంతాన్ని పాటిస్తోంది ఈ అమ్మడు. తాజాగా శ్రియ బీచ్ కు వెళ్లింది. ఆ బీచ్ లో అమ్మడు రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తుంది. తాజాగా శ్రియ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా బికినీలో పోజులు పెట్టేసింది. తాజాగా శ్రియా బికినీ అందాలను చూసి కుర్రాళ్లకు దిమ్మ తిరిగి పోయింది. శ్రియా తన నాజూకు అందంతో నెట్టింట్లో మంటలు రేపుతోంది. శ్రియ వెకేషన్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: shriya saran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X